ఆర్యోగం, ఆర్థికంగా ఫిట్‌గా ఉండేందుకు ప్రజలు ఎంత వరకైనా పరుగెడతున్నారు. డైట్ విషయంలో ఏం చేయడానికైనా సిద్ధపడుతున్నారు. ఈ క్రమంలో మన పూర్వికులు పాటించే వాటినే ఆచరిస్తున్నారు. అలాంటిదే మూలికవైద్యాలు, తృణ ధాన్యాలు తినడం, ప్రకృతితో కలిసి జీవించడం. వీటినే నమ్ముకొని ఆరోగ్యాలను బాగు చేసుకోవాలని తలస్తున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకునేది అలాంటిదే.
పాతకొ వింత కొత్త ఒక రోత అనేది పాత సామెత. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు ప్రజల అభిరుచులు మారుతున్నాయి. ఒక్క ఆరోగ్యం విషయంలోనే కాదు అన్నింటి కూడా పాత విధానాలు పాటించేందుకు ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. అందుకే కాంక్రీట్ జంగిల్స్‌లో పల్లె వాతావరణం కనిపించేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రకృతితో కలిసి మెలిసి జీవింతేందుకు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు.
అలా ప్రకృతితో కలిసి మెలిసి జీవించే విధానాన్ని ‘డర్టీ వెల్‌నెస్’ అని పేరు పెట్టారు. ఈ విధానం పాతే అయినప్పటికీ ఫిట్‌నెస్ కోసం నేటి తరం కొత్తగా ప్రయత్నిస్తోంది. అందుకే ఇప్పుడు ట్రెండీగా మారిపోయింది. ఇప్పుడు ప్రజలు ఆస్తుల కోసం ఎంతలా పరుగెడుతున్నారో ఆరోగ్యం కోసం అంతే వేగంతో పరుగెడుతున్నారు. రెండింటిలో ఫిట్‌గా ఉండేందుకు చేయని ప్రయత్నం లేదు. అలాంటి ప్రయత్నం నుంచి వచ్చిందే డర్టీ వెల్‌నెస్ కాన్సెప్ట్.
ఆరోగ్యంగా ఫిట్‌గా ఉండటం అంటే కేవలం శారీరక ఆరోగ్యమే కాదు మానసికంగా కూడా ఫిట్‌గా ఉండాలని జనం కోరుకుంటున్నారు. అలాంటి వారికి ఈ డర్టీ వెల్‌నెస్ చాలా ప్రయోజనకరంగా ఉంటోంది. గ్లోబల్ వెల్నెస్ సమ్మిట్ ప్రకారం ‘డర్టీ వెల్నెస్’ 2022 నుంచి ట్రెండ్‌లో ఉంటూ వస్తోంది. శారీరక ,మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి ప్రజలు దీనిని పాటిస్తున్నారు. భూమి, ప్రకృతితో ఉండటం ద్వారా తనను తాను ఫిట్‌గా ఉంచుకోవడంపై దృష్టి పెడతారు.
రైతుకి, భూమికి అవినాభావసంబంధం ఉంటుంది. భూమితోనే వారి జీవితాలు వారి కుటుంబాలు ముడిపడి ఉంటాయి. అయితే అభివృద్ధి పేరుతో కొంత వరకు ఆ కనెక్షన్ పట్టుతప్పుతూ వస్తోంది.
భారీ భవంతులు రావడంతో మనిషి క్రమంగా మట్టికి దూరమవుతూ వస్తున్నాడు.దీంతో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. రోగాల బారిన పడుతున్నాడు. రసాయనాలు తింటూ కాలుష్యాన్ని పీలుస్తూ ఆయుస్సులో రోజులు తగ్గించుకొని బతికేస్తున్నాడు.
ఇలా కాంక్రిట్ జంగిల్‌లో బతుకున్న మానవుడు శారీరక ఆరోగ్యాన్నే కాకుండా మానసిక ఆరోగ్యాన్ని కూడా పోగొట్టుకంటున్నారు. ఫలితంగా ఒత్తిడి, డిప్రెషన్ పెరిగిపోతున్నాయి. ఆత్మహత్యలు, ఆకస్మిక మరణాలకు లెక్కేలేకుండా పోతోంది.
అందుకే మానసిక, శారీరక ఆరోగ్యం కోసం డబ్బులు ఇచ్చి కొన్ని ప్రాంతాల్లో తోటపనులు చేస్తున్నారు ప్రజలు. గార్డెనింగ్ ఫిట్‌గా ఉండటానికి సహాయపడుతుంది గ్రహించిన వైద్యులు ప్రకృతికి దగ్గరగా జీవించాలని సూచన చేస్తున్నారు. జీవితంలో మార్పు కావాలనుకునే వాళ్లు మట్టితో మమేకమై జీవిస్తున్నారు. మట్టిలో ఆడుకుంటున్నారు. గడ్డిపై చెప్పులు లేకుండా నడుస్తున్నారు. పరుగుల ప్రపంచాన్ని మరిచిపోయి హాయిగా గడిపేందుకు ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తున్నారు. ఇలా మురికిగా ఉంటూ మానసిక శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు
ఈ కాన‌్సెప్టు నుంచి వచ్చినవే మడ్ బాత్, మట్టి స్నానం వంటి పోకడలు . చాలా మంది గార్డినింగ్ ఓ వ్యాపకంలా మార్చుకుంటున్నారు. చిన్న కమతాలు ఏర్పాటు చేసుకొని పొలం పనులు చేస్తున్నారు. ఏదో రూపంలో మట్టిలో ఎక్కువ సమయం ఉండేలా ప్రయత్నిస్తున్నారు. రోజు జిమ్‌లో చెమట పట్టడం కంటే ఇదే మెరుగైందిగా భావిస్తున్నారు.
గడ్డి, నేల, బురదలో నడవడం పని చేయడంతో చాలా ప్రయోజనాలు ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. వీటి వల్ల సుఖ నిద్ర ఉంటుందని అంటున్నారు. మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుందని చెబుతున్నారు. ఇది నాడీ వ్యవస్థపై మెరుగైన ప్రభావం చూపుతుందని వివరిస్తున్నారు.