టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ కమెడీయన్ ఎవరన్నా ఉన్నారు అంటే అది ఒక్క బ్రహ్మానందం మాత్రమే అని చెప్పాలి. చలనచిత్ర పరిశ్రమలో ఆయన్ను మించిన కమెడియన్ లేరు అంటే.. దానికి ఔననే చెప్పాలి. ఎన్నో వందల సినిమాల్లో నటించి సినీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడాయన. ఆయనలా కామెడీ చేసి నవ్వించే వారు ఇప్పటి వరకు ఇంకెవరూ రాలేదు కూడా.
దాదాపు నాలుగు దశాబ్దాల పాటు కడుపుబ్బ నవ్వించిన కమెడియన్ బ్రహ్మానందం. ఇక కొన్ని సినిమాలు హీరోల క్రేజ్ తో హిట్ అయితే.. మరికొన్ని సినిమాలు మాత్రం బ్రహ్మానందం కామెడీ వల్ల హిట్ అయ్యాయనడంలో ఎలాంటి అతిశయోక్తి కాదు. అయితే బ్రహ్మానందం చేసే కామెడీలు ఒకప్పుడు బ్లాక్ బస్టర్ కాకపోయినా ఇప్పుడు మాత్రం సోషల్ మీడియాలో రచ్చ లేపుతున్నాయనే చెప్పాలి.
ఇక ఆయన ఒకప్పుడు సంవత్సరానికి 10 సినిమాలతో బిజీ బిజీగా గడుపుతూ ఉండేవారు. కానీ ఇప్పుడు ఆయన సినిమాలకు బ్రేక్ ఇచ్చాడు. ఇటీవల కాలంలో పూర్తిస్థాయిలో సినిమాలు తగ్గించేశాడు. దీంతో ఈ జనరేషన్ వారికి మాత్రం ఆయన సినిమాలు కరువనే చెప్పాలి. అయితేేనేం ఫేమస్ అన్నట్లు ఇప్పుడు ఆయన సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.
బ్రహ్మానందంకి పెట్టింది పేరు మీమ్స్ కింగ్ అని. అలాంటి మీమ్స్ కింగ్ డైలాగ్స్ ఇప్పటి వరకు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ లేపాయి. మరి ఆ కింగే సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇస్తే.. అవును మీరు విన్నది నిజమే. భారీ ప్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఆయన సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చేస్తున్నాడు. రీసెంట్ గా బ్రహ్మి ఇన్ స్టా లోకి అడుగు పెట్టాడు.
‘Yourbrahmanandam’ ఐడీతో ఆయన ఇన్‌స్టాలోకి వచ్చేశారు. అందుకు సంబంధించిన విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ప్రస్తుతం ఆయన తన కొడుకు గౌతమ్‌తో కలిసి ‘బ్రహ్మానందం’ మూవీలో నటిస్తుండగా.. అందుకు సంబంధించిన ప్రమోషనల్ ఈవెంట్ లో ఈ విషయాన్ని వెల్లడించారు. దీంతో ఆయన ఇన్ స్టాలోకి వచ్చారన్న సమాచారంతో అభిమానులు, నెటిజన్లు ఫుల్ గా ఫాలో అవ్వడం మొదలెట్టేశారు.అతి కొద్ది సమయంలోనే బ్రహ్మానందం కి సుమారు 163K ఫాలోవర్స్ రావడం విశేషం. చూడాలి మరి ఇన్‌స్టాలో తన మీద వచ్చే మీమ్స్ కి బ్రహ్మానంద్ ఎలా రియాక్ట్ అవుతారో.