HEALTH TIPS: రాత్రిపూట ప్రశాంతమైన నిద్ర కోసం వీటిని ట్రై చేయండి.. లేవమన్నా లేవరు..!

HEALTH TIPS

ప్రస్తుత బిజీ లైఫ్ లో చాలామంది తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఉరుకులు పరుగులతో ఉద్యోగాలు చేస్తూ తమ ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవడం లేదు. దీంతో ఎన్నో అనారోగ్యాల బారిన పడుతున్నారు. అది వాళ్ళ మానసిక శారీరక ఆరోగ్యం పై ప్రభావం చూపుతుంది. దీనివల్ల చాలామందికి రాత్రిపూట నిద్ర పట్టడంలేదు. అంతేకాకుండా మనశ్శాంతి లేక గందరగోళానికి గురవుతున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో ఒత్తిడిని తగ్గించేందుకు యోగ, వ్యాయామాలు చేయడంతో పాటు కొన్ని ఆరోగ్యపరమైన చిట్కాలు కూడా పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. రాత్రిపూట కొన్ని ఆహారాలు అలవాట్లు చేసుకుంటే మంచిగా నిద్ర పడుతుందని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం

లావెండర్ టీ

లావెండర్ టీని రాత్రిపూట తాగడం వల్ల బాగా నిద్ర పడుతుందట. ఈ టీలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంట్ ఇన్ఫ్లోమేటరీ లక్షణాలు ఉంటాయి. అందువల్ల ఇవి ఒత్తిడిని తగ్గించడంలో చాలా సహాయపడతాయి. అందువల్ల రాత్రిపూట నిద్రలేక సఫర్ అవుతున్నవారు పడుకునే ముందు ఈ టీ తాగితే బాగా నిద్ర పడుతుంది. ఇవి నరాలను శాంతి పరిచి మంచి నిద్రను కలిగిస్తాయి.

పుదీనా టీ

పుదీనా ఆకులు అందరికీ తెలిసినవే. వీటిని కూరలో ఉపయోగిస్తారు. పుదీనా టీ తాగడం వల్ల కూడా మంచి ప్రయోజనాలు ఉంటాయి. పుదీనా ఆకులు టీ ఒత్తిడిని తగ్గించడంలో బాగా సహాయపడుతాయి. అంతేకాకుండా మంచి ఉపశమనాన్ని కూడా అందిస్తుంది. అందువల్ల ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు పుదీనా టీ తాగితే మంచిది

చమోమిలే టీ

చమోమిలే టీ. దీనిని చామంతి పువ్వు టీ అని అంటారు. ఇందులో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయట. అవి శారీరిక మానసిక ఆరోగ్యానికి చాలా మంచిదని చెబుతున్నారు.  ఇది ఒత్తిడిస్తాయిని తగ్గించడంతోపాటు నిద్ర సమస్యలను కూడా తొలగిస్తుంది. రాత్రి పడుకునే ముందు దీనిని తాగితే ఆందోళన కుదుటపడుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది

పాలు తేనే

పాలు తేనె.. ఇవి అందరికీ తెలిసిన పదార్థాలే. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వేడి పాలలో తేనె కలిపి తాగితే ఒత్తిడి తగ్గుతుంది. అంతేకాకుండా నాడీ వ్యవస్థ రిలాక్స్ చేయడానికి పనిచేస్తుంది. మంచి నిద్ర కోసం గోరువెచ్చని పాలలో తేనె కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనాకరంగా ఉంటుంది.

తరవాత కథనం