Jr NTR: నా దగ్గరకు ఎవరూ రావొద్దు.. ఎన్టీఆర్ ఎమోషనల్ రిక్వెస్ట్!

Jr NTR Emotional Post

జూనియర్ ఎన్టీఆర్ ఇటీవల దేవర సినిమాతో వచ్చాడు. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎన్నో అంచనాలతో తెరకెక్కింది. ఫస్ట్ నుంచి సినిమాపై భారీ బజ్ క్రియేట్ అయింది. అలాంటి అంచనాల మీద తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల మనసు మాత్రం గెలుచుకోలేకపోయింది. దీంతో రిలీజ్ అయిన ఫస్ట్ నుంచే మిక్సిడ్ టాక్ అందుకుంది. దీంతో చాలా మంది ఎన్టీయార్ ను స్క్రీన్ప్ర మిద చూడలేమేమో అనుకున్నారు. కానీ అతడు బాలివుడ్ లో ఓ సినిమా చేస్తున్నాడు అని తెలిసి హ్యాపీగా ఫీల్ అయ్యారు.

హృతిక్ రోషన్ తో వార్2 సినిమాలో ఎన్టీయార్ నటిస్తున్నాడు. ఈ సినిమా కూడా భారీ అంచనాలతో రూపొందుతోంది. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ తాజాగా తన అభిమానుల కోసం ఒక విజ్ఞప్తి చేశారు. ఇటీవల ఆయన్ను చూసేందుకు కుప్పం నుంచి హైదరాబాదుకు పలువురు ఫ్యాన్స్ పాదయాత్రగా వచ్చారు. ఇప్పుడు దానిని దృష్టిలో పెట్టుకొని ఎన్టీఆర్ కీలక విజ్ఞప్తి చేశారు. అభిమానులు తనపై చూపిస్తున్న అపారమైన ప్రేమకు కృతజ్ఞతలు తెలిపారు.

తనను కలుసుకోవాలని ఎదురుచూస్తున్న అభిమానుల ఆసక్తిని అర్థం చేసుకున్నానని అన్నారు. త్వరలోనే ఒక సమావేశం లో కలుద్దామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని అన్ని అనుమతులతో పోలీసు బందోబస్తు మధ్య ఎలాంటి సమస్యలు రాకుండా నిర్వహించుకుందామని తెలిపారు. ఇంతటి పెద్ద సమావేశం నిర్వహించడానికి కొంత సమయం అవసరం అవుతుంది అన్నారు.

కాబట్టి అభిమానులు నెటిజన్లు కాస్త ఓపికతో ఉండాలని ఆయన కోరారు. ఈనేపద్యంలోనే తనను కలుసుకోవడానికి ఫ్యాన్స్ ఎవరూ పాదయాత్ర చేయొద్దని ఆయన కోరారు. తనకు అభిమానుల ఆనందమే కాకుండా వారి సంక్షేమం కూడా తన అత్యంత ప్రధానమని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన రిలీజ్ చేశారు. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది

తరవాత కథనం