Tollywood: టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ సీనియర్ నటి మృతి

pushpalatha

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సీనియర్ నటి పుష్పలత కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఇవాళ చెన్నైలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు.

87 ఏళ్ల నటి పుష్పలత మృతి పై పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ఇక కెరియర్ పరంగా ఆమె తెలుగు, తమిళం అని తేడా లేకుండా ఎన్నో సినిమాల్లో నటించారు. సీనియర్ హీరోలైన ఎన్టీఆర్ సహా మరెంతో మందితో నటించారు. మొత్తంగా వందకు పైగా సినిమాలు చేశారు.

ఎన్టీఆర్ హీరోగా నటించిన చెరపకురా చెడేవు అనే సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక తమిళంలో శివాజీ, ఎం జి ఆర్, జయశంకర్, జెమినీ గణేష్ లతో కలిసి నటించారు. తెలుగులో ఆడబిడ్డ, వేటగాడు, మా ఊరిలో మహాశివుడు, రక్త బంధం, షోలం, కొండవీటి సింహం, ఇద్దరు కొడుకులు, మూగవాని పగ, రంగూన్ రౌడీ, విక్రమ్, ప్రతిజ్ఞ, ఉక్కుమనిషి, వంటి సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు.

అప్పట్లో ఆమె క్రేజ్ ఓ రేంజ్ లో ఉండేది. ఇక 1963 లో ఏవీఎం రాజన్ నటించిన నానుమ్ ఒరు పెన్ చిత్రంలో నటించిన పుష్పలత ఆ సమయంలోనే ప్రేమలో పడింది. నటుడు రాజన్ ను ప్రేమించింది. ఆ తర్వాత వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు కూడా ఉన్నారు. ఇందులో ఒక కూతురు హీరోయిన్ గా రాణించి మంచి పేరు సంపాదించుకున్నారు.

తరవాత కథనం