నటి కుష్బూ ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఒకప్పుడు తెలుగు, తమిళం అనే లేకుండా నటించి స్టార్ హీరోయిన్గా వెలుగొందారు. అనంతరం డైరెక్టర్ కం హీరో సుందర్ సితో ప్రేమ వివాహం చేసుకొని సినిమాలకు దూరమయ్యారు. ఇప్పుడు పొలిటికల్ గా దూసుకుపోతున్నారు.
ఒకప్పుడు సినిమాల్లో అదరగొట్టిన ఈ నటి ఇప్పుడు తమిళ రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తున్నారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో సైతం యాక్టివ్ గా ఉంటున్నారు. ట్రోలింగ్స్ వివాదాలపై స్పందిస్తూ ఉంటారు. ముఖ్యంగా అమ్మాయిలపై జరిగే అఘాయిత్యాలును లేవనెత్తుతారు. ఇక సినిమాలకు దూరమైన ఈమె ఇప్పుడిప్పుడే బుల్లితెరపై కనిపిస్తున్నారు.
జబర్దస్త్లో జడ్జిగా తనదైన పాత్ర పోషిస్తున్నారు. కృష్ణ భగవాన్ తో ఆమె వేసే పంచులు తెగ నవ్విస్తూ ఉంటాయి. అయితే తాజాగా ఆమెకు సంబంధించి ఓ వార్త నెట్టింట వైరల్ అవుతుంది. ప్రస్తుతం ఆమె గాయాల పాలైనట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించి ఫోటో వీడియో వైరల్ గా మారింది.
ఆమె చేతికి కట్టుతో ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో అభిమానులు, సినీ ప్రియులు, రాజకీయ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఆమె ఫోటో షేర్ చేసిన అతి కొద్ది క్షణాల్లోనే ఏమైంది అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే అది ఎప్పుడు జరిగింది.. ఎలా జరిగింది.. ఎక్కడ జరిగింది.. అనేది తెలియ రాలేదు.
ఆ ఫోటోకి క్యాప్షన్ ఇస్తూ “అనుకోని గాయాలు మన ప్రయాణాన్ని ఆపాలని చూస్తాయని కానీ మనం అవేమి పట్టించుకోకుండా ఆగకుండా చిరునవ్వుతో ముందుకు సాగాలని” అని పాజిటివ్గా రాసుకొచ్చారు. ప్రస్తుతం ఆమె పోస్ట్ నెట్టెంట వైరల్ గా మారింది.