ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వారు తీసుకునే ఆహారం పట్ల శ్రద్ధ తీసుకోవాలి. ఆ సమయంలో వారు తీసుకునే ఆహారం పిల్లల ఎదుగుదలపై వారి ఆరోగ్యం పై ప్రభావం చూపుతుంది. కాబట్టి తినే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా పోషకాలతో నిండిన పండ్లను తినాలని చెబుతున్నారు.
అయితే ప్రెగ్నెన్సీ సమయంలో కొన్ని పండ్లు తినకూడదని అంటున్నారు. అందులో పైనాపిల్, బొప్పాయి వంటివి గర్భం దాల్చాక తినకూడదని హెచ్చరిస్తున్నారు. అయితే నారింజపండు తినవచ్చు అని అంటున్నారు. ఎందుకంటే ఈ పండు తినవచ్చా లేదా అనేది చాలామందిలో డౌట్. కాబట్టి దాన్ని తినవచ్చని వైద్యులు చెబుతున్నారు. గర్భ ధారణ సమయంలో నారింజ పండు తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు. ఇందులో విటమిన్ ఏ, బి, సి, మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం, వంటి అనేక పోషకాలు ఉంటాయని అంటున్నారు.
అంతేకాకుండా ఆరెంజ్ పండ్లు అధిక మొత్తంలో నీరు ఉంటుందని ఇది మొత్తం ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెబుతున్నారు. దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం
నారింజపండ్లలో ఫోలేట్ ఉంటుంది. ఇది గర్భిణీ స్త్రీలలో న్యూరల్ ట్యూబ్స్ అభివృద్ధికి సహాయపడుతుంది.
అలాగే ఆరెంజ్ పండ్లు తినడం వల్ల రక్తహీనత సమస్య రాకుండా ఉంటుంది. ఇతర ఆరోగ్య సమస్యలు ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
గర్భధారణ సమయంలో హైడ్రేషన్ అనేది చాలా ముఖ్యం కాబట్టే అలాంటి సమయంలో ఆరెంజ్ పండు తింటే డీహైడ్రేషన్ కు గురవకుండా ఉంటారు.
ఇందులో ఉండే అనేక పోషకాలు పిండo ఎదుగుదలకు ఎంతో దోహదం చేస్తాయి. గర్భధారన సమయంలో మెదడు, వెన్నుపాము, ఎముకులకు, పోషణను అందిస్తుంది.
అందువల్ల గర్భిణీ స్త్రీలు ప్రతి రోజు కనీసం 85 మిల్లీగ్రామ్ విటమిన్ సి తీసుకుంటే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ఎక్కువగా తింటే సమస్యలు వస్తాయని అంటున్నారు. ఎసిడిటీ అలాగే గుండెల్లో మంట వంటివి వస్తాయని అంటున్నారు. కాబట్టి రోజుకు రెండు పండ్లు తింటే మంచిదని చెబుతున్నారు.