పీరియడ్స్ సమయంలో మహిళలు ఎందో తీవ్రమైన నొప్పిని అనుభవిస్తారు. తమలోని బాధను ఎవరికీ చెప్పుకోలేక.. దాన్ని భరించలేక విలవిల్లాడిపోతారు. అందువల్ల కొన్ని పండ్లు తీసుకోవడం వల్ల పీరియడ్స్ సమయంలో నొప్పుల నుంచి కాస్త రిలీఫ్ పొందొచ్చని వైద్యులు చెబుతున్నారు. మరి పండ్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం
పైనాపిల్
పుల్ల పుల్లగా, తియ్య తియ్యగా ఉండే ఫ్రూట్ పైనాపిల్ ఫ్రూట్. ఇందులో ఉండే ఎంజైమ్ములు ఇన్ఫ్లమేషన్ను తగ్గిస్తాయి. దీంతో కండరాలకు విశ్రాంతి అందుతుంది. అదే సమయంలో నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
యాపిల్స్
యాపిల్స్ తింటే చాలా మంచిదని వైద్యులు తరచూ చెప్తుంటారు. అందువల్ల దీనిని పీరియడ్స్ సమయంలో తీసుకుంటే మెరుగైన జీర్ణక్రియ అందుతుందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి కడుపు ఉబ్బరం కూడా తగ్గుతుందని అంటున్నారు. అలాగే దీనిలోనూ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పీరియడ్స్ సమయంలో తీవ్ర నొప్పిని తగ్గిస్తాయని చెబుతున్నారు. కాబట్టి రోజుకో యాపిల్ తింటే మంచి ప్రయోజనాలు కలుగుతాయని వైద్యులు తెలుపుతున్నారు.
బొప్పాయి
చాలామంది పీరియడ్స్ సమయంలో బొప్పాయి తినకూడదు అని అంటుంటారు. కానీ ఆ సమయంలో బొప్పాయి తింటే చాలా మంచిదని, దాని వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. బొప్పాయిలో విటమిన్ ఏ, పపైన్ వంటి ఎంజైమ్స్ ఉంటాయి. కాబట్టి పీరియడ్ సమయంలో వీటిని తింటే.. ఆ టైంలో వచ్చే హార్మోనల్ సమస్యలను దూరం చేస్తాయని చెప్తున్నారు. అందువల్ల ఈ సమస్యను ఎదుర్కొంటున్న మహిళలు రోజుకు ఒక కప్పు లేదా 150 గ్రాముల బొప్పాయి తింటే ఆరోగ్యానికి మంచిదని అంటున్నారు.
నారింజ
నారింజల్లోని కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ సి, ఉంటాయి. ఇవి గర్భాశయ కండరాలకు ఉపశమనాన్ని అందిస్తాయి. అదే సమయంలో మూడ్‌ని మెరుగుపరుస్తాయి. అందువల్ల రోజుకు 1 లేదా 2 నారింజ పండ్లు తింటే మంచిదని వైద్యులు చెబుతున్నారు.
అరటిపండ్లు
అత్యంత ఎక్కువగా, అతి తక్కువ ధరలో లభించే పండ్లు అరటిపండ్లు. వీటిలో ఉండే బోరాన్ పీరియడ్స్ సమయంలో వచ్చే తిమ్మిరిని తగ్గించి మంచి ఉపశమనాన్ని అందిస్తుంది. అంతేకాకుండా ఇందులోని విటమిన్ బి6, పొటాషియం కూడా అధికంగా ఉంటాయి. ఇవి కండరాలకు విశ్రాంతిని ఇస్తాయి. అదే సమయంలో కడుపు ఉబ్బరాన్ని తగ్గంచి హాయిగా ఉండేలా చేస్తాయి. అందువల్ల పీరియడ్స్ సమయంలో ప్రతి రోజు ఒక అరటిపండును తీసుకుంటే మంచిది.
వీటితో పాటు స్ట్రాబెర్రీ, రాస్ప్బెర్రీలు, బ్లూబెర్రీలు, యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి కాబట్టి వీటిని తిసుకున్నా మంచిదే అని వైద్యులు సూచిస్తునన్నారు.
గమనిక: దీనిని పలు అధ్యయనాలు, పరిశోధనలు నుంచి సేకరించిన సమాచారం. మీ అవగాహన కోసం ఇక్కడ అందించాం. పూర్తి సమాచారం కోసం వైద్యుడిని సంప్రదించాలి.