Tamannaah Bhatia: విజయ్ వర్మకు బ్రేకప్ చెప్పిన తమన్నా..! పోస్ట్ వైరల్

tamannaah bhatia and vijay varma

టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎన్నో ఏళ్లగా ఇండస్ట్రీలో ఉంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. పెద్ద పెద్ద హీరోలతో పాటు చిన్న హీరోలతోనూ నటించి ఫుల్ క్రేజ్ అందుకుంది. చిరంజీవి, ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్ మహేష్ బాబు, అల్లు అర్జున్, వంటి పెద్ద పెద్ద హీరోలతో నటించి మరింత స్టార్ డం అందుకుంది.

ఇండస్ట్రీలోకి వచ్చి చాలా ఏళ్లే అవుతుంది కానీ ఇప్పటివరకు తన క్రేజ్ తగ్గలేదు. అయితే గతంలో కంటే ఇప్పుడు టాలీవుడ్ లో సినిమాలు కరువయ్యాయి. చేసిన సినిమాలు హిట్టు పడకపోవడంతో ఆమెకు ఆఫర్లు తగ్గాయి. దీంతో టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి మకం మార్చింది. అక్కడ కొన్ని సినిమాలు చేసింది. ఆ సమయంలోనే నటుడు విజయవర్మతో ప్రేమలో పడింది. అప్పటినుంచి వీరికి సంబంధించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది.

దానికి తోడు పార్టీలు పబ్బులు పెళ్లిళ్లు ఇలా ప్రతి వేడుకలోనూ ఈ జంట కనిపిస్తూనే ఉంటుంది. ఇప్పటికీ వీరికి సంబంధించి చాలా ఫోటోలు వీడియోలు తెగ వైరల్ అయ్యాయి. అయితే త్వరలోనే ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు జోరుగా సాగాయి. గత రెండేళ్లుగా గాడ ప్రేమలో మునిగి తేలుతున్న ఈ జంట తమ ప్రేమ బంధాన్ని వివాహ బంధంగా మార్చుకోవాలని భావిస్తున్నారని వార్తలు చక్కర్లు కొట్టాయి.

అయితే ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ తాజాగా మిల్కీ బ్యూటీ పెట్టిన ఒక పోస్ట్ హాట్ టాపిక్ గా మారింది. ఈ మేరకు ఇన్స్టాలో పోస్ట్ పెట్టింది. ప్రేమించడానికి రహస్యం ప్రేమించడమే అని తాను అనుకుంటున్నట్టు తెలిపింది. సరదాగా ఉండడానికి రహస్యం ఆసక్తికరంగా ఉండటమే అని పేర్కొంది. వేరే వాళ్ళు మిమ్మల్ని అందంగా చూడాలంటే మీరు వేరే వాళ్ళను అలా ఉండాలి అని చెప్పాలంది.

ఒకరి స్నేహం కావాలంటే ముందు మనం వారితో ఫ్రెండ్ గా ఉండాలి అంటూ ఇంట్రెస్టింగ్ కొటేషన్ తన ఇన్స్టా స్టోరీలో రాసుకొచ్చింది. ప్రజెంట్ ఆ స్టోరీ ఇప్పుడు పలు అనుమానాలకు తావిస్తోంది. ఏంటి విజయ్ వర్మ, తమన్నా విడిపోయారా అనే వార్తలు కూడా ఈ పోస్ట్ ద్వారా వినిపిస్తున్నాయి. ఇప్పటికిప్పుడు ఇలాంటి పోస్ట్ పెట్టాల్సిన అవసరం ఏముంది అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. చూడాలి మరి తమన్న దీనిపై మళ్లీ స్పందిస్తుందా లేదా అని

తరవాత కథనం