భారత్ – పాకిస్తాన్ మ్యాచ్ అంటే అందరూ ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూస్తూ ఉంటారు. ఎవరు గెలుస్తారు.. ఎవరు గెలుస్తారు అని తెగ కంగారు పడతారు. మిగతా మ్యాచ్ల కంటే భారత్, పాకిస్తాన్ మ్యాచ్ పై ఆసక్తి చూపిస్తారు. అయితే ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ చూసి చాలా రోజులు గడిచాయి. ఇప్పుడు మళ్లీ ఆ రోజులు రాబోతున్నాయి. భారత్, పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ త్వరలో జరగబోతుంది.
దీనికోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. త్వరలో ఛాంపియన్స్ ట్రోఫీ మొదలవుబోతుంది. ఈ ట్రోఫీలో భారత్ – పాకిస్తాన్ మధ్య ఫిబ్రవరి 23న మ్యాచ్ జరగనుంది. అయితే ఐసీసీ టోర్నీలో మినహా మరి ఎక్కడ పాకిస్తాన్తో మ్యాచ్ లేకపోవడంతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఈ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీనిపై టీమిండియా మాజీ కోచ్ రవి శాస్త్రి స్పందించారు.
ఈ మేరకు గతంలో ప్రస్తుత భారత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ మాట్లాడిన వ్యాఖ్యలపై ఆయన రియాక్ట్ అయ్యారు. భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ ను ఇతర మ్యాచులు మాదిరిగానే చూస్తామని గతంలో గంభీర్ చెప్పుకొచ్చాడు. దీనిపై ఇప్పుడు రవి శాస్త్రి స్పందించి.. గతంలో ఇలాంటి మాటలు తాను కూడా చెప్పానని అన్నాడు. అయితే గంభీర్ వ్యాఖ్యలకు తాను మద్దతిచ్చినా.. వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉంటుందని రవి శాస్త్రి పేర్కొన్నారు.
తాను ఏడేళ్ల పాటు ప్రధాన కోచ్ గా పనిచేశానని అప్పట్లో తనను ఇదే ప్రశ్న అడిగే వారిని తెలిపారు. ఇక అప్పుడు తాను కూడా గంభీర్ చెప్పినట్లే చెప్పేవాడినని అన్నారు. కానీ మనం ఆలోచించే దానికంటే భారీ అంచనాలు ఉంటాయని పేర్కొన్నాడు. కేవలం మీడియా కోసం మాత్రమే అలా చెప్పే వాళ్ళమని అన్నాడు. ఇక లోతుగా వెళ్తే మాత్రం విజయం సాధించాల్సిందేనని.. లేకపోతే మళ్లీ వచ్చే మ్యాచ్ వరకు దీని గురించే చాలామంది మాట్లాడుకుంటారు అని చెప్పుకొచ్చారు.
గతంలో ఏం జరిగిందనేది ఎవరు పట్టించుకోరని ఒక్క మ్యాచ్ ఓడిపోయినా మళ్లీ మళ్లీ దాని గురించే మాట్లాడుకుంటారని అన్నారు. అది టాక్సీ డ్రైవర్ లేదా మరెవరైనా సరే పాకిస్తాన్తో మ్యాచ్లో భారత్ ఓడిపోతే వీళ్ళకి ఏమైంది అంటూ అడుగుతారని అన్నారు. కాబట్టి దాయాదులతో పోరంటే ఇతర గేమ్ లతో పోలిస్తే ఇది పూర్తి భిన్నంగా ఉంటుందని అన్నారు. ఇప్పుడు 50 ఓవర్ల క్రికెట్ మ్యాచ్ కాబట్టి అనుభరంగా పాకిస్తాన్ కంటే భారత్ టీం చాలా ఉత్తమంగా ఉంది అని రవి శాస్త్రి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు నెట్టెంట వైరల్ గా మారాయి