సాధారణంగా చాలామంది మంచి సువాసన రావాలని ఒంటికి పెర్ఫ్యూమ్ కొడుతుంటారు. స్నానం చేసినా చేయకపోయినా బయటికి వెళ్లేటప్పుడు మాత్రం ఆహా ఓహో అని అనిపించేలా సువాసన వెదజల్లే ఒక మంచి పెర్ఫ్యూమ్ను కొడతారు. ఆడ మగ అనే తేడా లేకుండా దీనిని వాడుతారు. వారి టేస్ట్లు తగ్గట్టుగా కూడా రకరకాల పెర్ఫ్యూమ్ లు అందుబాటులో ఉన్నాయి.
అలాగే వీటితోపాటు చాలామంది తమ ఇళ్లలో మంచి సువాసన రావాలని రూమ్ ఫ్రెషనర్స్ కూడా వాడుతారు. ఈ సువాసన మనసుకు ఎంతో హాయినిస్తాయి. అదే సమయంలో ఆరోగ్యానికి కూడా చాలా ముప్పును తెచ్చి పెడతాయని నిపుణులు చెబుతున్నారు. కొన్ని పెర్ఫ్యూమ్ లు, రూమ్ సెషనర్లు స్త్రీ, పురుషుల్లో సంతాన ఉత్పత్తి సమస్యలను పెంచుతాయని వైద్యులు చెబుతున్నారు.
ముఖ్యంగా పెర్ఫ్యూమ్, రూమ్ ఫ్రెషనర్లు ఆడవారిలోనూ అలాగే మగవారిలోనూ హార్మోన్ల అసమతుల్యతకు దారితీస్తాయని అలాగే ఫెర్టిలిటీ సమస్యలను పెంచుతాయని చెబుతున్నారు. దానికి ఒక కారణం ఉంది. వీటిలో పారాబెన్లు, థలెట్స్, ఆక్సినాల్స్, ఫార్మాలిహైడ్లు, బ్యూటీలేటెడ్, హైడ్రాక్ షటోలియన్, సింథటిక్ కెమికల్స్ ఉపయోగిస్తారు. వీటిని ఎండోక్రైనా డిస్ట్రబ్దింగ్ కెమికల్స్ అని కూడా అంటారు. ఈ కెమికల్స్ బాడీలోని సహజ హార్మోన్లను నిరోధిస్తాయట. అందువల్ల హార్మోలలో అంతరాయం ఏర్పడుతుంది.
పురుషుల్లో సమస్యలు
ఇక పురుషుల్లో కూడా వీటివల్ల ఫెర్టిలిటీలో నెగెటివిటీ ఇంపాక్ట్ చూపిస్తుంది. వీటివల్ల స్పెర్మ్ క్వాలిటీ కౌంట్ తగ్గుతుందట. స్పెర్ములో డిఎన్ఏ దెబ్బతింటుందని అంటున్నారు. దీనివల్ల పిండి అభివృద్ధి సంతాన ఉత్పత్తి ఫలితాలను ప్రతుకూలంగా మారుస్తుందని చెబుతున్నారు. అందుకే పెర్ఫ్యూమ్స్, రూమ్ ఫ్రెషనర్ కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. వీటికి బదులుగా సుగంధ పరిమళ ద్రవ్యాలను వాడుకోవచ్చు అని చెబుతున్నారు. అయితే ఇప్పటికీ కొన్ని అధ్యయనాలు వీటి పై పరిశోధన జరిపి గుర్తించినప్పటికీ ఇంకా దీనిపై మరికొన్ని పరిశోధనలు చేస్తున్నారు. అయినా వీటివల్ల ప్రమాదాలు ఉన్నాయని జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు వైద్యులు.
స్త్రీలలో సమస్యలు
వీటి కారణంగా స్త్రీలలో పీరియడ్స్, రిప్రోడక్టివ్ హెల్త్, అండోత్సర్గం వంటి వాటిపై ప్రభావం చూపిస్తుందని చెప్తున్నారు. వీటివల్ల ఇర్ రెగ్యులర్ పీరియడ్స్ సమస్యలు వస్తాయని అంటున్నారు. అలాగే అండాశయ ఫోలికల్స్ ను ఇది దెబ్బతీస్తాయి. అదే సమయంలో ప్రెగ్నెన్సీ కి ఆటంకం కలిగిస్తాయని చెబుతున్నారు. అలాగే అలాగే గర్భస్రావం ప్రమాదాన్ని కూడా పెంచుతాయని అంటున్నారు .