స్టార్ హీరో సోను సూద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సాయం చేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. ఎవరికి కష్టం వచ్చిందని తెలిస్తే వెంటనే రియాక్ట్ అవుతారు. రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లోను ఆయన హీరోనే. ఎంతోమందికి ఆయన ఉపాధి కల్పించారు. వేల మందికి ట్రక్కుల్లో భోజనం పంపించారు.
కరోనా టైం లో దేవుడిలా ఆదుకున్నారు. ఆ సమయంలో ఆయన చేసిన సహాయం ఎవరు మర్చిపోలేనిది. పట్టణాల్లో చిక్కుకున్న ప్రజలను తమ ఊర్లకు పంపించాడు. స్పెషల్ బస్సులు వేయించి మరీ కాపాడాడు. అలాగే కొండ ప్రాంతాల్లో ఉన్న వారికి కరెంటు వేయించారు. చదువుకుంటానని అడిగితే లాప్టాప్లు కొనిచ్చారు. ఇలా ఒకటేంటే కరోనా కాలంలో సోను చేసిన సహాయాలు ఎన్నో ఉన్నాయి.
ఎంతో మందికి దేవుడిల నిలిచారు. ఆయన సహాయాని కి గుర్తుగా చాలాచోట్ల గుడులు కట్టించారు. అందులో ఆయన విగ్రహాన్ని పెట్టి పూజించారు. అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. అలాంటి రియల్ హీరో సోను సూద్ మీద ఇప్పుడు అరెస్ట్ వారెంట్ జారీ అయింది. అవును మీరు విన్నది నిజమే. సోను సూదును అరెస్టు చేసి కోర్టు ముందు హాజరు పరచాలని న్యాయస్థానం తెలిపింది.
ఇంతకీ ఏమైంది.. ఏం జరిగింది.. సోను సూదును అరెస్ట్ చేయాల్సినంత పని ఏం జరిగింది అని అంతా ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం. లూధియానాకు చెందిన లాయర్ రాజేష్ కన్నా పది లక్షలు మోసపోయినట్టుగా కోర్టులో కేసు వేశారు. మోహిత్ శుక్ల అనే వ్యక్తి మోసం చేశాడని ఫేక్ రిజిక కాయిన్ అంటూ చెప్పి పది లక్షలు కాజేశారని అతడు కేసు వేశాడు.
ఈ కేసులో సోను సూదులు సాక్షిగా పెట్టారు. అయితే సోను సూద్ మాత్రం ఈ కేసులో వాదనలకు వెళ్లకుండా తప్పించుకున్నాడు. దీంతో లూథియానా కోర్టు సోను సూద్ మీద అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఫిబ్రవరి 10న సోను సూదును కోర్టు ముందు హాజరు పరచాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఫ్యాన్స్ సినీప్రియలు ఒకంత కంగారు పడుతున్నారు. ఏం జరుగుతుందో అని ఆందోళన చెందుతున్నారు.