భారత్- ఇంగ్లాండ్ మధ్య వన్డే సిరీస్ గురువారం ప్రారంభమైంది. తొలి మ్యాచ్ లో టీమిండియా ఘనవిజయం సాధించింది. నాగ్ పూర్ వేదికగా జరిగిన ఈ వన్డేలో టీమిండియా చెలరేగి ఆడింది. ఇంగ్లాండ్ కు చుక్కలు చూపించింది. ఇంగ్లాండ్ విధించిన 249 పరుగులు లక్ష్యాన్ని భారత్ కేవలం 38.4 ఓవర్లలో చేదించింది. ఈ మ్యాచ్లో శుభమన్ గిల్ అలాగే శ్రేయస్ అయ్యర్, అక్షర పటేల్ దుమ్ము దులిపేసారు.
నాగపూర్ వేదికగా జరిగిన ఈ తొలి వన్డే మ్యాచ్లో హర్షిత్ రానా, జైశ్వల్, ఆర్ంగేట్రం చేశారు. ఇదిలా ఉంటే టాస్ గెలిచిన ఇంగ్లాండ్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ ఫీల్డింగ్ కు దిగింది. ఇంగ్లాండ్ జట్టు 47.4 ఓవర్లలో 248 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది.
ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ 26 బాల్స్ లో 43 పరుగులు చేశాడు. కెప్టెన్ బట్లర్ 67 బంతుల్లో 52 పరుగులు చేశాడు. బెతెల్ 64 బంతుల్లో 51 పరుగులు చేశాడు. మిగతావారు తక్కువ రన్స్ తో వెనుదిరిగారు. బౌలింగ్లో హర్షిత్ రానా అదరగొట్టేసాడు. తొలి మ్యాచ్ లోనే మూడు వికెట్లు తీసి శభాష్ అనిపించాడు. జడేజా మూడు వికెట్లు, మహమ్మద్ షమీ, అక్షర పటేల్, కుల్దీప్ యాదవ్ ఒక్కో వికెట్ తీశారు.
ఇక ఇంగ్లాండ్ విధించిన పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు భరత్ రెడీ అయింది. ఓపెనర్లుగా జైశ్వల్ రోహిత్ శర్మ దిగారు. కానీ అనుకున్నంత స్థాయిలో ఆడలేకపోయారు. అతి తక్కువ సమయంలోనే వికెట్లు కూల్పోవడంతో భారత్ ఓడిపోతుందని అంత భావించారు. కానీ శ్రేయస్ అయ్యర్, గిల్ మ్యాచ్ మలుపు తిప్పారు. ఫోర్లు సిక్సర్లతో అదరగొట్టేసారు. అక్షర పటేల్ సైతం చెలరేగిపోయారు.
టీమిండియా వైస్ కెప్టెన్ శుభమన్ గిల్ 96 బంతుల్లో 87 పరుగులు చేసి ఔరా అనిపించుకున్నాడు. అలాగే శ్రేయస్సు అయ్యార్ 36 బంతుల్లో 59 పరుగులు చేసి ప్రశంసలు అందుకున్నాడు. అక్షర పటేల్ 47 పంతుల్లో 52 పరుగులు చేశాడు. ఇలా ఈ ముగ్గురి ఆట తీరు మ్యాచ్నే మలుపు తిప్పింది. ఇంగ్లాండ్ బౌలర్లలో ఆర్చర్ 2 వికెట్లు, మహమూద్ 2 వికెట్లు, బెతెల్, రషీద్ ఒక్క వికెట్ పడగొట్టారు.