బాదం గింజలు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు తరచూ వాటిని సూచిస్తారు. వాటిని తింటే మంచిదని ఎముకలు దృఢంగా ఉంటాయని చెబుతుంటారు. అందువల్ల వీటిని ప్రతి రోజు నానబెట్టి ఉదయం తింటే చాలా మంచిదని మెదడు పనితీరు మెరుగ్గా అవుతుందని నిపుణులు చెప్తుంటారు.
ఈ బాధo గింజల్లో విటమిన్ ఈ, ప్రోటీన్స్, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ సహా మరెన్నో పోషకాలు ఇందులో నిండుగా ఉంటాయి. ఇవి ఆరోగ్యాన్ని సురక్షితంగా ఉంచడానికి సహాయపడతాయి. అందువల్లే వీటిని తినాలని వైద్యులు సూచిస్తారు. దీంతో చాలామంది రాత్రి నానబెట్టిన బాదంపప్పును ఉదయాన్నే తింటారు. అయితే వీటి వల్ల కూడా సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
ఆరోగ్యంగా ఉండాలని బాదం గింజలను అధికంగా తింటే సమస్యలు తప్పవని వైద్యులు చెబుతున్నారు. వీటిని మోతాదులో మాత్రమే తీసుకోవాలని అంటున్నారు. మోతాదుకు మించి తింటే మాత్రం తిప్పలు తప్పవని హెచ్చరిస్తున్నారు. మరి అతిగా బాదం గింజలు తింటే ఎలాంటి సమస్యలు వస్తాయా ఇప్పుడు తెలుసుకుందాం.
కిడ్నీ సమస్యలు
బాదం గింజలను మోతాదు కంటే ఎక్కువగా తీసుకుంటే కిడ్నీ సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వీటిలో ఉండే అగ్జలెట్స్ కిడ్నీలో రాళ్లను పెంచడానికి ప్రేరేపిస్తాయి. అందువల్ల బాదం గింజలను ఎక్కువగా తింటే కిడ్నీ సమస్యలు వస్తాయి.
మలబద్ధకం
బాదం గింజలను అధికంగా తింటే కిడ్నీ సమస్యల తో పాటు మలబద్ధకం కూడా వస్తుందని చెబుతున్నారు. కాబట్టే మలబద్ధకం వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అందువల్ల రోజు 4 బాదం గింజలను మాత్రమే తింటే మంచిదని చెబుతున్నారు. మలబద్ధకం సమస్య తగ్గాలంటే ఫైబర్ అధికంగా ఉండే ఫుడ్స్ తినాలి. అందులో అంజీర్, వాల్ నట్లు ఎక్కువగా తీసుకోవాలి. ఆకుకూరల్లో కూడా ఫైబర్ ఉంటుంది కాబట్టి అది తీసుకున్న పర్వాలేదు.