Hair Problem Tips: ఇది కదా కావాల్సింది.. ఈ నేచురల్ పదార్థాలో మోకాలి వరకు జుట్టు పెరగడం ఖాయం!

hair problem tips

సాధారణంగా మహిళల్లో జుట్టు సమస్య అనేది ఎక్కువగా ఉంటుంది. జుట్టు రాలిపోవడం, జుట్టు పెరగకపోవడం.. ఇలాంటి సమస్యలను మహిళలు ఎక్కువగా ఎదుర్కొంటారు. అయితే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. కాలుష్యం, వయసు పెరగడం, ఒత్తిడి, సరైన నిద్ర లేకపోవడం, పోషకాహారం తీసుకోకపోవడం ఇలా ఎన్నో జుట్టు రాలడానికి కారణాలు. అందువల్ల ఈ సమస్యలతో బాధపడుతున్న వారు బ్యూటీ పార్లర్ వంటి వాటికి వెళ్ళకుండా ఇంట్లోనే న్యాచురల్ పదార్థాలతో జుట్టు రాలకుండా చేసుకోవచ్చు. వీటివల్ల చాలా వరకు జుట్టు సమస్యలు దూరం అవుతాయి. ఇప్పుడు వాటి గురించి పూర్తిగా తెలుసుకుందాం.

మెంతులు

మెంతులు అనేవి అందరికీ తెలిసినవే. వీటిని ఎన్నో వంటకాల్లో వాడుతాం. ఇందులో రిచ్ ప్రోటీన్, నికోటినిక్ యాసిడ్స్ అత్యధికంగా ఉంటాయి. ఇవి జుట్టు ఆరోగ్యాన్ని ఒత్తుగా పెరిగేలా చేస్తాయి. దీనిని పెరుగులో నానబెట్టి మిక్సీ పట్టి దాన్ని మాస్కులా ధరించాలి.

మందార

మందార గురించి అందరికీ తెలిసిందే. ఇందులో రిచ్ విటమిన్స్, యాంటీ యాక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు ఫాలికల్స్ ని మెరుగ్గా చేస్తాయి. అందువల్ల దీనిని ఇన్ఫ్యూజ్డ్ ఆయిల్ లేదా హెయిర్ మాస్కులు ఉంటాయి వాటిని వాడుకోవచ్చు.

అలోవెరా

హెయిర్ హెల్త్ ని కాపాడడంలో అలోవెరా ముందు వరుసలో ఉంటుంది. ఇందులో ఎంజైమ్స్ ఉంటాయి. దీని కారణంగా జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. అందువల్ల అలోవెరానో జుట్టుకు రాసుకోవచ్చు లేదా ఎయిర్ మాస్క్ లో కలిపి కూడా ధరించవచ్చు.

పెప్పర్ మింట్ ఆయిల్

పెప్పర్మింట్ ఆయిల్ వల్ల స్కాల్ప్ హెల్తీగా ఉంటుంది. దీనివల్ల జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా పెరుగుతుంది కూడా. ఈ ఆయిల్ ను మరో ఆయిల్ తో కలిపి రాయాలి.

తరవాత కథనం