ఇంగ్లాండ్ తో ఇటీవల జరిగిన తొలి వన్డేలో అక్షర పటేల్ అద్భుతమైన ఆట తీరు కనబరిచాడు. హాఫ్ సెంచరీ తో ఔరా అనిపించాడు. ఇక రెండో వన్డే మ్యాచ్ ఆదివారం జరగనుంది. అయితే ఇప్పుడు అక్షర పటేల్ సూపర్ బ్యాటింగ్ కారణంగా రిషబ్ పంత్ కు అవకాశాలు తక్కువ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది.
తొలి వన్డేలో కీపర్గా కేఎల్ రాహుల్ను మేనేజ్మెంట్ తీసుకుంది. రిషబ్ పంతను బెంచ్ కే పరిమితం చేయడంతో ఈ అనుమానాలు తలెత్తాయి. రిషబ్ పంత్ ప్లేస్లో కేఎల్ రాహుల్ను కీపర్ గా తీసుకోవడం.. అలాగే కేఎల్ రాహుల్ స్థానంలో అక్షర్ పటేల్ ను బ్యాటింగ్కు దించడం.. ఈ అవకాశాన్ని అక్షర్ పటేల్ బాగా ఉపయోగించుకున్నాడు.
దీంతో తదుపరి వన్డేలోనూ.. అలాగే త్వరలో జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీ లోను ఇదే ఫార్మేషన్ ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పంత్ కు తుది జట్టులో అవకాశాలు రావడం కష్టమేనని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. అయితే మరికొందరు మాత్రం మిల్ ఆర్డర్లో పంత్ ఉంటేనే మంచిదని.. అతడు ఉంటే ప్రత్యర్థులు కాస్త భయపడతారని అంటున్నారు.
జట్టును గెలిపించే ఇన్నింగ్స్ ఆడటం అతడి ప్రత్యేకత అంటూ ఇంకొందరు కొనియాడుతున్నారు. దీనిపై భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. టాప్స్ 7 బాటర్ లలో లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ తప్పకుండా ఉండాలని ఆయన అన్నారు. ఇప్పుడు ఇంగ్లాండ్ తో తొలి వన్డే తర్వాత అక్షర పటేల్ మంచి ఆప్షన్ గా కనిపిస్తున్నాడని అన్నారు.
టెస్టుల్లోనూ అతడు ఆట తీరు అద్భుతంగా ఉందని.. వన్డేలోనూ స్పిన్నర్లపై ఎదురు దాడి చేస్తున్నాడని పేర్కొన్నారు. అందువల్ల మిడిల్ ఆర్డర్లో అక్షర్ పటేల్ సరిపోతాడని ఆయన తెలిపారు. అంతేకాకుండా బౌలింగ్ ఆప్షన్ కూడా ఉంటుందని చెప్పుకొచ్చారు. అందువల్ల రిషబ్ పంత్ కు చాన్స్ చాలా తక్కువ ఉన్నాయని ఆయన వెల్లడించారు