ఇంగ్లాండ్ తో జరిగిన తొలి వన్డే మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించింది. సుభమన్గిల్, శ్రేయస్ అయ్యర్, అక్షర పటేల్ దుమ్ము దులిపేసారు. శ్రేయస్ ఆఫ్ సెంచరీ చేయడమే కాకుండా టీమిండియా ప్లేయర్లకి అలాగే ఫ్యాన్స్ కి మంచి జోష్ ని ఇచ్చాడు.
ఫోర్లు సిక్సర్లతో బాల్ ను ఎగరేసి కొట్టాడు. అప్పటికే రెండు వికెట్లు కోల్పోయిన భారత్ కాస్త నెమ్మదిగా ఆడాల్సిన టైం అది. కానీ శ్రేయస్ అయ్యర్ మాత్రం తన కాన్ఫిడెన్స్ లెవల్ తో భారత్ ను విజయం దిశగా తీసుకెళ్లడంలో కీలకపాత్ర పోషించాడు. అప్పటికే ఓపెనర్లుగా దిగిన జైస్వాల్, రోహిత్ శర్మ కొద్ది సమయంలోనే వెనుదిరిగారు. ఆ సమయంలో గిల్, శ్రేయస్ క్రేజ్ లో ఉన్నారు.
భారత్ ఓడిపోతుందన్న టైంలో శ్రేయస్ ఫోర్లు, సిక్సర్లతో లతో అదరగొట్టేసాడు. అతడు బ్యాటింగ్ తీరుపై తాజాగా భారత మాజీ పెసర్ జహీర్ ఖాన్ స్పందించాడు. ఇంగ్లాండ్ తో మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ ఆత్మవిశ్వాసం అద్భుతమని జహీర్ ఖాన్ పేర్కొన్నాడు. అతడు తదుపరి మ్యాచ్లోనూ ఇలానే రాణించాలని చెప్పాడు. ఇప్పుడంతా శ్రేయస్ అయ్యర్ ఇన్నింగ్స్ గురించే మాట్లాడుతున్నారు అని అన్నారు.
అతడు వికెట్లు పడినప్పుడు ఎదురు దాడి చేసిన తీరు వండర్ఫుల్ అని ప్రశంసించాడు. టీమిండియా అప్పటికే రెండు వికెట్లు కోల్పోయిందని ఆ సమయంలో క్రిజ్ లో ఉన్నవారు ఎవరైనా మెల్లగా ఆడేందుకు ప్రయత్నిస్తారని కానీ శ్రేయస్సు మాత్రం తన కాన్ఫరెన్స్ లెవల్ పెంచుతూ ఫోర్లు, సిక్సర్లు కొట్టాడని అన్నారు. తాము వెనకడుగు వేసేది లేదని శ్రేయస్సు ముందుకు దూసుకెళ్లాడు అని చెప్పుకొచ్చాడు. అందుకే మంచి ఫామ్ లో ఉన్న బ్యాటర్ ను ఎప్పుడూ పక్కన పెట్టడం మంచిది కాదని ఆయన పేర్కొన్నాడు.