Tollywood Hero Nikhil: వీడియో లీక్స్‌పై నిఖిల్ సంచలన వ్యాఖ్యలు..ఆ వీడియోలు నావే కానీ!

Tollywood Hero Nikhil

హీరో రాజ్ తరుణ్, లావణ్య వ్యవహారం గతేడాది ఎంత హార్ట్ టాపిక్ అయిందో అందరికీ తెలిసిందే. రాజ్ తరుణ్ తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని వాడుకొని వదిలేసినట్టు లావణ్య ఆరోపించింది. ఇక వీరిద్దరి వ్యవహారంలో మస్తాన్ సాయి అనే వ్యక్తి పేరు కూడా గట్టిగానే వినిపించింది. మస్తాన్ సాయి పై కూడా లావణ్య ఇలానే గుంటూరు పోలీస్ స్టేషన్ లో కేసు వేసిందని రాజ్ తరుణ్ ఆరోపించాడు.

మస్తాన్ సాయి మరెవరో కాదని లావణ్య మాజీ ప్రియుడని రాజ్ తరుణ్ అన్నాడు. అయితే ఈ వ్యవహారం ఇప్పుడు మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. ఇటీవల మస్తాన్ సాయి దగ్గర ఉన్న ఒక హార్డ్ డిస్క్ ను దొంగలించి లావణ్య పోలీసులకు అప్పగించింది. అందులో 300 మంది ప్రైవేట్ వీడియోలు ఉన్నాయని ఆమె ఆరోపించింది. అంతేకాకుండా టాలీవుడ్ స్టార్ హీరో నిఖిల్ కు సంబంధించిన వీడియోలు కూడా అందులో ఉన్నాయని ఆమె పేర్కొంది.

ఇక ఆ హార్డ్ డిస్క్ పోలీసులకు ఇవ్వడంతో వారు మస్తాన్ సాయిని అరెస్టు చేశారు. దీంతో నిఖిల్ పేరు వార్తల్లోకి ఎక్కింది. నిఖిల్ వీడియోలేంటి.. అతడి వీడియోలు మస్తాన్ సాయి దగ్గర ఎలా ఉన్నాయి అని పలువురు చర్చించుకున్నారు. అయితే ఈ విషయం బాగా వైరల్ అవడంతో తాజాగా నిఖిల్ స్పందించాడు.

తనపై జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని అన్నాడు. తన ఫ్యామిలీతో ఉన్న వీడియోలను తప్పుగా చూపిస్తున్నారని చెప్పుకొచ్చాడు. ఆ వీడియోలు మరెక్కడివో కాదని.. కార్తికేయ 2 సక్సెస్ మీట్ తర్వాత జరిగిన డిన్నర్ పార్టీలోని వీడియోలని అన్నాడు. ఆ పార్టీలో ఉన్నది కూడా తమ కుటుంబ సభ్యులు అని క్లారిటీ ఇచ్చాడు. ఇందులో నిజానిజాలు ఏంటో అనేది పోలీసులు కూడా తెలుసు అన్నాడు. ఇప్పుడు ఆయన వ్యాఖ్యలు నెట్టెంటా వైరల్ గా మారాయి.

తరవాత కథనం