లైగర్ హీరో విజయ్ దేవరకొండ ఒక మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. లైగర్ మూవీతో విజయ్ కి పెద్ద దెబ్బ పడింది అనే చెప్పాలి. ఆ తర్వాత ఖుషి మూవీ చేశాడు. ఆ సినిమా కాస్త పర్వాలేదు అనిపించింది. దీని తర్వాత ఫ్యామిలీ స్టార్ సినిమా తీశాడు. ఇది కూడా మిక్స్డ్ టాక్ తో అందరిని ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు ఒక బ్లాక్ బస్టర్ హిట్ కోసం ప్రయత్నిస్తున్నాడు.
ఇందులో భాగంగానే నేషనల్ అవార్డు విన్నర్ దర్శకుడు గౌతం తిన్ననూరితో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు అందరిలోనూ క్యూరియాసిటీ పెంచాయి. అందులో విజయ్ దేవరకొండ చిన్న హెయిర్ కట్ తో, మాస్ లుక్ లో కనిపించి హైప్ పెంచేశాడు. దీంతో విజయ్ దేవరకొండ నెక్స్ట్ మూవీ ఎలా ఉంటుందా అని అంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇప్పుడంతా ఇదే చర్చ నడుస్తోంది కూడా. “వీడి 12” వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాను శ్రీకర స్టూడియో సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పథకాలపై నాగ వంశీ, సాయి సౌజన్య కలిసి భారి స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి అప్డేట్ కోసం సినీప్రీయులు ఎంతో తహతహలాడుతున్నారు. ఈ క్రమంలో వారికి సర్ప్రైజ్ అందించేందుకు మూవీ మేకర్స్ రెడీ అయ్యారు.
ఈ సినిమా టైటిల్ అండ్ టీజర్ రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా చేశారు. ఫిబ్రవరి 12 న ఈ సినిమా టైటిల్ అండ్ టీజర్ రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఇక అనౌన్స్మెంట్ పోస్టర్లో ఒక కిరీటాన్ని చూపించడంతో మరింత బజ్ క్రియేట్ అయింది. ఇది ఇప్పుడు సినీప్రియులో మరింత ఆసక్తిని రేపుతోంది. చూడాలి మరి ఈ సినిమాకి ఎలాంటి టైటిల్ పెడతారో టీజర్ ఎలా ఉంటుందో.