Chiranjeevi- Ravi Teja: అన్నయ్యతో పోటీకి సిద్ధమవుతున్న తమ్ముడు.. తగ్గుతాడా? నెగ్గుతాడా?

Chiranjeevi - Ravi Teja

మెగాస్టార్ చిరంజీవి, రవితేజ కలిసి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమా గతంలో ఎంతటి భారీ హీట్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో చిరు యాక్టింగ్ ఓ ఎత్తైతే రవితేజ యాక్టింగ్ మరో ఎత్తినే చెప్పాలి. వీరిద్దరూ తమ నటనతో సినిమాని మరో రేంజ్‌కి తీసుకెళ్లారు. అలా గతంలో సంక్రాంతికి రిలీజ్ అయిన ఈ సినిమా మంచి వసూళ్లను సాధించింది.

అయితే ఇప్పుడు ఈ ఇద్దరూ పోటీపడుతున్నారు. నువ్వా నేనా అన్నట్లుగా సినిమాలను రిలీజ్ చేయనున్నారు. అవును మీరు విన్నది నిజమే.. చిరంజీవి, రవితేజ తమ సినిమాలను ఒకే నెలలో రిలీజ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. రవితేజ ప్రస్తుతం బారీ హిట్ కోసం చూస్తున్నాడు. ఇందులో భాగంగానే భాను భోగవరపు దర్శకత్వంలో మాస్ జాతర అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో శ్రీలీల హీరోయిన్గా నటిస్తుంది.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు సినీ ప్రియులని బాగా ఆకట్టుకున్నాయి. గ్లిoప్స్ కి కూడా ఓ రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ పై  ఓ వార్త నెట్టెంటా చెక్కర్లు కొడుతుంది. ఈ చిత్రాన్ని మే నెలలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారట. ఇక అదే సమయంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర మూవీ కూడా రిలీజ్ కు సిద్ధమైంది. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. మే 9న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు మేకర్స్ తెలిపారు.

దీంతో ఇప్పుడు ఈ రెండు సినిమాలు ఓకే నెలలో పక్క పక్క రోజులో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మరి చిరంజీవిని ఎంతగానో అభిమానించే రవితేజ తన సినిమాను వాయిదా వేస్తాడా లేక తాను కూడా చిరంజీవితో పోటీపడతాడా అనేది ఉత్కంఠ గా మారింది. ఇక ఫ్యాన్స్ కూడా కాస్త కంగారు పడుతున్నారు. చూడాలి మరి ఎవరు తప్పుకుంటారో ఎవరు ముందుకు వెళ్తారో. దీనిపై మేకర్స్ నుంచి అప్డేట్స్ వచ్చినంత వరకు కాస్త వెయిట్ చేయాల్సిందే.

తరవాత కథనం