ఉత్తర ప్రదేశ్ ప్రయాగరాజ్‌లో అత్యంత ఆధ్యాత్మిక వేడుక అయిన మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. ఫిబ్రవరి 26 వరకు ఈ ఉత్సవం జరగనుంది. దీంతో రోజురోజుకు భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉంది తప్ప తగడం లేదు. ఈ కుంభమేళాలో ఎన్నో వింతలు విడ్డూరాలు జరిగాయి. ఎంతోమంది ఫేమస్ అయ్యారు. మరి ఎంతోమంది డబ్బులు సంపాదించుకున్నారు.
ఇక ఫేమస్ అయిన వారిలో మోనాలిసా ఒకరు. కుంభమేళాలో రుద్రాక్షలు అమ్ముకోవడానికి వచ్చిన ఈమె ఓవర్ నైట్ లో ఫేమస్ అయిపోయింది. ఆమె అందం, తేనెకళ్లకు నెటిజన్లు ఫిదా అయిపోయారు. దీంతో ఆమెను ఫుల్ ఫేమస్ చేసేసారు. ఎక్కడ చూసినా ఆమె పేరే, ఆమె వీడియోసే. దీంతో ఆమె కారణంగా ఆ ప్రాంతంలో ట్రాఫిక్ జాం ఏర్పడింది. అక్కడికి వచ్చిన వారందరూ ఆమెను చూసేందుకు గుమిగూడటంతో అక్కడ గందరగోల పరిస్థితి ఏర్పడింది.
దీంతో పోలీసులు ఆమెని తన ఇంటికి పంపించేశారు. అయినా ఆమె క్రేజ్ తగ్గలేదు. ఏకంగా సినిమా ఆఫర్ ఆమెకు వచ్చింది. బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సనోజ్ మిశ్రా ఆమెకి తన చిత్రంలో అవకాశం ఇచ్చారు. త్వరలో ఆయన చేయబోతున్న ‘ది డైరీ ఆఫ్ మణిపూర్’ అనే పేరుతో తెరకెక్కబోతున్న మూవీ కోసం అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. ఇప్పుడు ఆమె రెమ్యూనరేషన్ గురించి జోరుగా ఒక ప్రచారం జరుగుతోంది.
మోనాలిసా తన తొలి సినిమా కోసం ఏకంగా 21 లక్షల రూపాయలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇది మాత్రమే కాకుండా లోకల్ గా బిజినెస్ ప్రమోషన్స్ కోసం 15 లక్షలతో డీల్ కుదుర్చుకున్నట్లు నెట్టింట ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ విషయం తెలిసి నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు. అదృష్టం అంటే ఆమెదే అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక మోనాలిసా చేయబోయే సినిమా ఏప్రిల్ నుంచి స్టార్ట్ కాబోతున్నట్టు తెలుస్తుంది.