Rohith Sharma: రోహిత్ శర్మ మరో రికార్డు.. కటక్‌లో దంచుడే దంచుడు!

rohith sharma

భారత్ ఇంగ్లాండ్ మధ్య 3 వన్డేల సిరీస్ లో భాగంగా నేడు రెండో వన్డే మ్యాచ్ జరుగుతోంది. కటక్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ అత్యంత రసవత్తరంగా సాగుతోంది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 49.5 ఓవర్లలో 304 పరుగులకు ఆలౌటైంది. దీంతో లక్ష్య చేదనకు దిగిన భారత్ దుమ్ము దులిపేస్తోంది.

ముఖ్యంగా ఈ మ్యాచ్ లో టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అదరగొట్టేసాడు. ఇప్పటి వరకు ఫామ్ లో లేని రోహిత్ పై ఎంతో మంది విమర్శలు, ట్రోల్లింగ్స్ చేశారు. ఇక ఈ మ్యాచ్ లో రోహిత్ 100 (119; 90 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్స్‌లు) పరుగులు చేసి.. అందరి నోర్లకు చెక్ పెట్టాడు. చాలాకాలం తర్వాత తనదైన శైలిలో దుమ్ము దులిపేశాడు.

ఓపెనర్ గా వచ్చిన రోహిత్ శర్మ వందకు పైగా పరుగులతో స్టేడియం మొత్తం జోష్ నింపాడు. కేవలం 30 బాల్స్ లోనే ఆఫ్ సెంచరీ చేసి హౌరా అనిపించాడు. అలా 76 బంతుల్లోనే సెంచరీ చేసి అదరగొట్టేసాడు. రోహిత్ శర్మకు వన్‌డేలో ఇది 32వ సెంచరీగా నమోదయింది.

అయితే ఇప్పటివరకు ఫామ్ లో లేని రోహిత్ దాదాపు 16 నెలల తర్వాత చెలరేగారడం ఫాన్స్ లో ఉత్సాహం నింపుతుంది. అంతేకాకుండా సెంచరీ చేయడం గమనార్హం. దీంతో రోహిత్ శర్మ మరో ఫీట్ ను అందుకున్నాడు. వన్డేల్లో అత్యధిక సిక్సులు కొట్టిన క్రికెటర్ లిస్టులో రోహిత్ (338 )తో రెండో స్థానంలో నిలిచాడు.

వెస్టిండీస్ స్టార్ ప్లేయర్ క్రిస్ గేల్ 331 నెంబర్ను వెనక్కి నెట్టి ఈ ఫీట్ అందుకున్నాడు. మొదటి స్థానంలో పాకిస్తాన్ ప్లేయర్ షాహిద్ అఫ్రిద్ ఉన్నాడు. అతడు 351 సిక్స్ లతో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు. ఇదిలా ఉంటే రోహిత్ శర్మ మరోవైపు అంతర్జాతీయ మ్యాచ్లలో అత్యధిక సెంచరీలు చేసిన భారత ప్లేయర్లలో మూడో స్థానంలో ఉన్నాడు.

తరవాత కథనం