IND VS ENG: బట్లర్ నిర్వాకం వల్లే విరాట్ కోహ్లీ త్వరగా ఔటయ్యాడు: ఫ్యాన్స్ ఆగ్రహం!

భారత్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన రెండో వన్డే లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ దుమ్ము దులిపేశాడు. 16 నెలల తర్వాత ఫామ్ లోకి వచ్చాడు. కెప్టెన్ గా తన బాధ్యత నిర్వర్తించాడు. కానీ విరాట్ కోహ్లీ మాత్రం ఇంకా ఫామ్ లోకి రాలేదని అనిపిస్తోంది.

ఇంగ్లాండ్ తో జరిగిన రెండో వన్డేలో ట్ మరోసారి తన పేవల ఫామ్ ను కొనసాగించాడు. కేవలం 5 పరుగులకే అవుట్ అయ్యాడు. అదిల్ రషీద్ బౌలింగ్లో కీపర్ కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. అయితే మొదట అంపైర్ నాట్ అవుట్ గా ప్రకటించాడు. కానీ ఇంగ్లాండ్ జట్టు డిఆర్ఎస్ తీసుకుంది.

దీంతో థర్డ్ ఎంపైర్ అవుట్ గా ప్రకటించారు. ఇప్పుడిదే నెట్టింట హార్ట్ టాపిక్ గా మారింది. ఇంగ్లాండ్ సారథి బట్లర్ కారణంగానే కోహ్లీ అవుట్ అయ్యాడని ఫ్యాన్స్ దుమ్మెత్తి పోస్తున్నారు. అలా ఎందుకు విమర్శిస్తున్నారు ఇప్పుడు తెలుసుకుందాం.

రషీ వేసిన 20వ ఓవర్ మూడో బాల్ కి విరాట్ అవుట్ అయ్యాడు. అయితే దీనికంటే ముందు బాల్ కి విరాట్ డ్రై చేశాడు. అది నేరుగా ఇంగ్లాండ్ సారధి బట్లర్ చేతికి వెళ్ళింది. అతడు వెంటనే ఆ బాలు పట్టుకుని కీపర్ వైపు విసరగా అది కోహ్లీ వైపు వచ్చింది. దీనిపై బట్టల కూడా క్షమాపణ చెబుతున్నట్టు విరాట్ వైపు చూశాడు.

బట్లర్ అలా చేయడం వల్లే విరాట్ కోహ్లీ తన ఏకాగ్రతను కోల్పోయాడని అందుకే తర్వాత బంతికి అయిపోయాడని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. కోహ్లీపై కావాలనే బాల్ ని విసిరినట్లు ఉందని.. కోహ్లీ ఏకాగ్రతను కోల్పోయేలా చేయడంలో బట్టల సక్సెస్ అయ్యాడని ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇప్పుడు అది వైరల్ గా మారింది.

తరవాత కథనం