Chiranjeevi: అల్లు అర్జున్ ‘పుష్ప2’ పై మెగాస్టార్ చిరంజీవి షాకింగ్ వ్యాఖ్యలు.. మెగా హీరోలు చాలా మంది..!

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మరో కొత్త సినిమాతో రాబోతున్నాడు. అతను నటిస్తున్న లేటెస్ట్ మూవీ లైలా. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఇందులో ఆయన పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ముఖ్యంగా అల్లు అర్జున్ పుష్ప2 మూవీ పై కీలక వ్యాఖ్యలు చేశారు. సినీ ఇండస్ట్రీ మొత్తం ఒకటేనని తమ మధ్య ఎలాంటి విభేదాలు గాని గొడవలు గాని లేవని ఆయన అన్నారు.

ఇక మెగా హీరోలంతా ఒకటేనని తామంతా ఎప్పుడూ కలిసి మెలిసే ఉంటామని చెప్పుకొచ్చారు. అలాగే పుష్ప2 సినిమా చూసి తానెంతో గర్వపడినట్లు చెప్పారు. పుష్ప 2 సినిమా పెద్ద హిట్ అయిందని బ్లాక్ బస్టర్ అయిందని దానికి తాను చాలా గర్విస్తున్నాను అని చెప్పుకొచ్చారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ తమ ఇంట్లో చాలామంది హీరోలు ఉన్నారని.. అందరూ కలిసిమెలిసి ఉంటామని అన్నారు. అన్ని చేస్తామని అలా అని తమ ఇమేజ్ లు ఏమైనా తగ్గిపోతాయా అని అన్నారు. అయితే ఒక్కోసారి సినిమాలు ఆడొచ్చు ఆడకపోవచ్చు కానీ ఏ సినిమా హిట్ అయినా అది ప్రతి ఒక్కరు ఆనందపడాల్సిన విషయమని ఆయన చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు నెట్టెంటా వైరల్ గా మారాయి. ఇప్పటివరకు మెగా వెర్సెస్ అల్లు అనే ట్యాగ్ సోషల్ మీడియాలో నడిచింది. మరి ఇప్పుడు చిరు కామెంట్స్ తో ఈ వివాదానికి పుల్ స్టాప్ పడుతుందా లేదా అనేది చూడాలి.

తరవాత కథనం