నేను ఐదు వేలతోనే స్టాక్ మార్కెట్ ప్రారంభించాను. ఇప్పుడు నా పెట్టుబడి లక్షల్లో ఉంది. అని చాలా మంది ప్రముఖులు చెబుతూ ఉంటారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలనే ఆసక్తి ఉండి కూడా నష్టాలకు భయపడి చాలా మంది ఆ మాటలు విని ఆశ్చర్యపోతారు. కానీ అందులో నిజం ఉంది. రాకేష్ జున్‌జున్‌వాలా లాంటి వాళ్లు కూడా కేవలం వేల నుంచే పెట్టుబడి ప్రారంభించారు. తర్వాత కోట్లకు పగడలెత్తారు. ఇప్పుడు మీరు కూడా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకొని ఇప్పుడు చెప్పినట్టు స్టాక్ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇస్తే తిరుగు ఉండదు. చాలా మంది రిటైల్ ఇన్వెస్టర్లు నష్టాలను చవిచూసిన భయపడిపోయి మార్కెట్ తలనొప్పి మనకొద్దు బాబోయ్ అని అకౌంట్ క్లోజ్ చేస్తుంటారు.
పోయిన చోటే వెతుక్కోవాలని పెద్దలు ఊరికే అనలేదు. స్టాక్ మార్కెట్ కూడా అంతే జాగ్రత్తగా తెలివి ప్రదర్శిస్తే నష్టాల తాత్కాలికమే అయినా లాభాలు శాశ్వతం. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని పెట్టుబడి పెట్టే వాళ్లే విజేతలుగా లక్కీ భాస్కర్‌గా మారుతారు. చాలా మంది లాభాల యావలో పడి కొన్ని సార్లు బేసిక్ రూల్స్ మర్చిపోతుంటారు. అలాంటి వాళ్లకు మార్కెట్ ఏదో రోజు కచ్చితంగా పెద్ద దెబ్బ కొడుతుంది. భారీ నష్టాలను మిగులుస్తుంది.
రిటైల్ స్టాక్ మార్కెట్ లో డబ్బులు సంపాదించడం అంత సులభం కాదు.ఇక్కడ పది శాతం మందే లాభాలు సంపాదిస్తున్నారు. మిగతా 90 శాతం మంది ఖాళీ చేతులతో నష్టాలు మూట కట్టుకొని వెళ్తున్నారు. ఇక్కడ రూల్స్ పాటిస్తూ పరిస్థితులకు అనుగుణంగా పెట్టుబడులు పెడుతుండేవాళ్లకే మనుగడ ఉంటుంది . లేకుంటే నష్టాలతో నిష్క్రమించాల్సి ఉంటుంది.
వీటన్నింటినీ మర్చిపోయి మీరు కూడా స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టి భారీగా లాభాలు సంపాదించవచ్చు. అయితే ఈ కింద చెప్పినట్టు 8 సూత్రాలను పాటించాలి.
1. ఎలా ప్రారంభించాలి: స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే ముందు, స్టాక్ మార్కెట్ అంటే ఏమిటో పూర్తిగా తెలుసుకోవాలి. అరకొర జ్ఞానంతో దిగితే మాత్రం మునిగిపోవడం ఖాయం. స్టాక్ మార్కెట్ ఎలా పని చేస్తుంది? స్టాక్ మార్కెట్ నుంచి ఎలా సంపాదిస్తారు? ఇవన్నీ తెలియకుంటే మాత్రం ఏటీఎంకు వెళ్లి డబ్బులు తీసుకున్నంత ఈజిగా మనీ సంపాదించ వచ్చని నమ్మకం పెట్టుకుంటే మాత్రం నష్టాలు తప్పవు. దీంతో ఆ 90 శాతం మందిలో మీరు కూడా ఉంటారు.
ఈ డిజిటల్ యుగంలో స్టాక్ మార్కెట్ గురించి చెప్పే యాప్‌లు చాలానే ఉన్నాయి. యూట్యూబ్‌లో కూడా చాలా మంది ఉచితంగా వీడియోలు చేస్తున్నారు. ఇంటి వద్ద కూర్చొనే వీటిపై అవగాహన పెంచుకోవచ్చు. కావాల్సిన సమాచారాన్ని తెప్పించుకోవచ్చు. అయితే ఇందులో ఫేక్ వెబ్‌సైట్‌లు, ఫేక్ సమాచారం చెప్పే వాళ్లు కూడా ఉన్నారు. పెట్టుబడితో మిమ్మల్ని నిలువునా ముంచేసే వాళ్లు కాచుకొని కూర్చుంటారు. వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి.
2. తక్కువ మొత్తంతో పెట్టుబడి పెట్టడం ప్రారంభించండి: స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడానికి పెద్ద మొత్తంలో ఉండాల్సిన అవసరం లేదని గుర్తు పెట్టుకోండి. మీరు సంపాదించుకున్నదంతా పెట్టుబడి పెట్టేందుకు ప్రయత్నించకండి. పక్కవాళ్లకు లాభాలు వస్తున్నాయని ఆశతో చాలా మంది ఇలానే ఉన్నదంతా ఊడ్చి మరీ పెట్టుబడి పెడుతుంటారు. ఇది చాలా ప్రమాదకరం. ఇలా పెట్టుబడి పెట్టిన వాళ్లు మార్కెట్ హెచ్చుతగ్గులు భరించలేక పోతుంటారు. అందుకే పదివేల రూపాయల లోపే పెట్టుబడిగా పెట్టండి.
౩. అప్పులు తీసుకొచ్చి పెట్టొద్దు: కొందరు వడ్డీలకు డబ్బులు అప్పులు తీసుకొచ్చి పెట్టుబడిగా పెడుతుంటారు ఇది అన్నింటి కంటే ప్రమాదకరం. ఆన్‌లైన్‌లో కనిపించే యాప్‌ల ద్వారా ఈ పెట్టుబడులు పెడుతుంటారు. దీని వల్ల మీరు మీ ఫ్యామిలీ ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో మీ వద్ద డబ్బులు లేకుంటే స్టాక్ మార్కెట్‌కు దూరంగా ఉండటం ఉత్తమం. కానీ అప్పులు చేసి తప్పులు చేయకండి.
4. అగ్రశ్రేణి కంపెనీలను ఎంచుకోండి: ఎక్కువ రాబడి వస్తుందని చాలా మంది చిన్న చిన్న కంపెనీలపై పెట్టుబడి పెడుతుంటారు. ఇలాంటి తప్పులు మీరు చేయొద్దు. అధిక రాబడుల కోసం, ప్రజలు బలంగా లేని కంపెనీల స్టాక్‌లలో డబ్బు పెట్టుబడి పెడతారు, ఆపై ఇరుక్కుపోతారు. అందువల్ల, బలమైన బ్లూ చిప్ కంపెనీలతో తరచుగా పెట్టుబడి పెట్టడం ప్రారంభించండి. మీకు కొన్ని సంవత్సరాల అనుభవం ఉన్నప్పుడు, మీరు కొంత రిస్క్ తీసుకోవచ్చు.
5.పెట్టుబడి పెట్టడం అవసరం: మీరు చిన్న మొత్తంతో పెట్టుబడి పెట్టడం ప్రారంభించినప్పుడు, క్రమంగా పెట్టుబడిని పెంచుతూ ఉండండి. మీ పోర్ట్‌ఫోలియోను సమతుల్యంగా ఉంచండి. మీరు కొన్ని సంవత్సరాల పాటు నిరంతరంగా మార్కెట్‌లో పెట్టుబడి పెట్టినప్పుడు, మీరు లక్ష్యాన్ని చేరుకోవచ్చు. తరచుగా మార్కెట్‌లో ఎక్కువ కాలం పెట్టుబడి పెట్టే వారికి ప్రయోజనం ఉంటుంది.
6.పెన్నీ స్టాక్‌లకు దూరంగా ఉండండి: రిటైల్ ఇన్వెస్టర్లు తరచుగా చౌక స్టాక్‌లపై దృష్టి పెడతారు. రూ.10-15 ధర ఉన్న స్టాక్‌లను అనవసరంగా కొనుగోలు చేసి, పడిపోవడంతో భయాందోళనలకు గురవుతారు. చౌక షేర్లలో తక్కువ పెట్టుబడి పెట్టడం ద్వారా ఎక్కువ సంపాదించవచ్చని వారు భావిస్తున్నారు. కానీ ఈ ఆలోచన తప్పు. కంపెనీ వృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఎల్లప్పుడూ స్టాక్‌లను ఎంచుకోండి. వ్యాపారం బాగా ఉన్న కంపెనీలో మాత్రమే పెట్టుబడి పెట్టండి.
7.పతనం సమయంలో భయాందోళన చెందకండి: స్టాక్ మార్కెట్‌లో పతనమైనప్పుడల్లా, భయాందోళన చెందకండి, కానీ దానిని పెట్టుబడి అవకాశంగా ఉపయోగించుకోండి. తరచుగా, రిటైల్ పెట్టుబడిదారులు వారు సంపాదించినంత కాలం పెట్టుబడి పెడతారు. కానీ మార్కెట్ తిరోగమన ధోరణిలోకి వెళ్లడంతో, రిటైల్ ఇన్వెస్టర్లు భయాందోళనలకు గురవుతారు, ఆపై భారీ నష్టాల భయంతో షేర్లను చౌకగా విక్రయిస్తారు. పెద్ద పెట్టుబడిదారులు కొనుగోలు కోసం క్షీణత కోసం వేచి ఉన్నారు.
8.సంపాదనలో కొంత భాగాన్ని సురక్షిత పెట్టుబడి పెట్టండి: స్టాక్ మార్కెట్ నుంచి వచ్చే ఆదాయాల్లో కొంత భాగాన్ని సురక్షిత పెట్టుబడిగా పెట్టుబడి పెట్టండి. ఇది కాకుండా, వారు తమ లాభాలను అడపాదడపా క్యాష్ చేసుకుంటారు. ప్రతి రిటైల్ ఇన్వెస్టర్‌కు అత్యంత ముఖ్యమైన ముఖ్యమైన విషయం ఏమిటంటే, వారు అవగాహన లేకుండా స్టాక్ మార్కెట్‌కు దూరంగా ఉండాలి. పెట్టుబడి పెట్టే ముందు ఆర్థిక సలహాదారు సహాయం తీసుకోవాలి. దేశంలోని పెద్ద పెట్టుబడిదారులను అనుసరించండి, వారి మాటలను తీవ్రంగా పరిగణించండి.