Rohith Sharma: రోహిత్ శర్మ మరో 13 పరుగులు చేస్తే చాలు.. ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్!

rohith sharma

టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు. ఇంగ్లాండ్ తో కటక్ వేదికగా జరిగిన రెండో వన్డే మ్యాచ్లో దుమ్ము దులిపేసాడు. ఈ మ్యాచ్లో సెంచరీ చేసి అదరగొట్టేశాడు. ఫోర్లు, సిక్సర్లతో స్టేడియంలో ఉత్సాహాన్ని నింపాడు. 90 బాల్స్ లో 119 పరుగులు చేసి ఔరా అనిపించాడు. దాదాపు 16 నెలల తర్వాత రోహిత్ సెంచరీ చేయడంతో అభిమానులు, క్రికెట్ ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

తమ అభిమాన క్రికెటర్ మళ్లీ ఫామ్ లోకి వచ్చాడంటూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. ఇదిలా ఉంటే రోహిత్ శర్మకి వన్డేల్లో ఇది 32వ సెంచరీ.. అలాగే ఇంటర్నేషనల్ క్రికెట్ లో 49వ సెంచరీ. దీంతో రోహిత్ మరో సెంచరీ చేస్తే టీమిండియా ప్లేయర్లలో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటరుగా మూడో స్థానంలో నిలుస్తాడు.

సచిన్ టెండుల్కర్ (100), విరాట్ కోహ్లీ (81), తర్వాత స్థానంలో రోహిత్ (50) లతో నిలుస్తాడు. ఇదంతా ఒకెత్తయితే రోహిత్ శర్మ ఇప్పుడు మరో భారీ రికార్డుకు దగ్గరలో ఉన్నాడు. అతడు ఇంగ్లాండ్ తో జరగబోయే మూడో వన్డే మ్యాచ్లో మరో 13 పరుగులు చేస్తే వన్డేల్లో అత్యంత వేగంగా 11,000 పరుగులు చేసిన రెండో ప్లేయర్ గా రికార్డు సృష్టించనున్నాడు.

సచిన్, గంగూలి, రికీ పాంటింగ్, జాక్విస్ కలీజ్ వంటి దిగ్గజాల కంటే 11 వేల రన్స్ పూర్తిచేసిన ప్లేయర్గా రోహిత్ శర్మ నిలవనున్నాడు. అయితే ఈ జాబితాలో విరాట్ కోహ్లీ ఇప్పటికే మొదటి స్థానంలో ఉన్నాడు. అతడు 222 ఇన్నింగ్స్ లోనే ఈ ఘనత సాధించాడు.

తరవాత కథనం