స్టార్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఒక బ్లాక్ బాస్టర్ హిట్టు కోసం ప్రయత్నిస్తున్నాడు. ఇందులో భాగంగానే గౌతమ్ తిన్ననూరితో ఓ సినిమా చేస్తున్నాడు. “విడి12” వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నాగవంశీ, సాయి సౌజన్య కలిసి నిర్మిస్తున్నారు.
ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు ఓ రేంజ్ లో రెస్పాన్స్ అందుకున్నాయి. ఇక ఈ సినిమా నుంచి అప్డేట్ కోసం సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారి ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఇటీవల మేకర్ అప్డేట్ అందించారు. త్వరలో టైటిల్ అండ్ టీజర్ రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. దీంతో ఆ సినిమాకి ఎలాంటి టైటిల్ పెట్టనున్నారు.. టీజర్ ఎలా ఉంటుంది అనే ఉత్కంఠ అందరిలోనూ ఉంది.
ఈ క్రమంలో మేకర్స్ ఈ సినిమా నుంచి మరో సర్ప్రైజ్ అందించారు. ఈ టైటిల్ టీజర్ కి ఒక్కో భాషలో ఒక్కో స్టార్ హీరో తమ వాయిస్ ఓవర్ ఇవ్వనన్నట్లు తెలిపారు. ఇందులో భాగంగానే తెలుగులో ఎన్టీఆర్ వాయిస్ ఇవ్వనన్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు విజయ్ దేవరకొండ ఆయనతో ఉన్న ఒక ఫోటోను షేర్ చేసాడు. నిన్నటి రోజు ఎక్కువ సమయం ఎన్టీఆర్‌తో గడిపానని ఇద్దరం చాలా జాలీగా హ్యాపీగా నవ్వుకున్నామని తెలిపాడు.
టీజర్ డబ్బింగ్ చేస్తున్నప్పుడు దానికి ప్రాణం పోసుకోవడం చూసి ఎన్టీఆర్ చాలా ఉత్సాహపడ్డాడన్నారు. థాంక్యూ తారక్ అన్న.. ఈ పిచ్చిని మా ప్రపంచానికి తీసుకువచ్చినందుకు అని విజయ్ దేవరకొండ పోస్ట్ పెట్టాడు. ఆ పోస్టులో ఎన్టీఆర్ తాను కలిసి ఉండటం చూసి అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. ప్రస్తుతం ఆ ఫోటో వైరల్ గా మారింది.