Prudhvi Raj: ‘లైలా’ చిచ్చు.. ఆసుపత్రి పాలైన నటుడు పృథ్వీ రాజ్!

Prudhvi Raj hospital

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటిస్తున్న కొత్త చిత్రం లైలా. ఈ సినిమా వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ లో నటుడు పృథ్వి రాజ్ వ్యాఖ్యలు నెట్టెంటా దుమ్మారం రేపాయి. వైసిపి నేతలను మేకలతో పోల్చడంతో సోషల్ మీడియాలో రచ్చ రేగింది. వైసీపీ అభిమానులు ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.

దీంతో బాయ్ కాట్ లైలా అంటూ హ్యాష్ ట్యాగ్ ను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ఈ హ్యాష్ ట్యాగ్ కు నిమిషాల్లో వేలకు వేల ట్వీట్లు వచ్చాయి. దాదాపు 86 వేల ట్వీట్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ దెబ్బతో మూవీ యూనిట్ ప్రెస్ మీట్ పెట్టింది. అందులో విశ్వక్సేన్ అండ్ నిర్మాత కలిసి పృథ్వి చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పారు.

ఒక్కరు తప్పు చేస్తే అందర్నీ నిందించడం సరైనది కాదని అన్నారు. ఆయన అలా మాట్లాడతారని అనుకోలేదని.. ఆయన అలా అన్నప్పుడు తామక్కడుంటే మైక్ లాక్కునే వాళ్ళమని విశ్వక్సేన్ చెప్పాడు. పృథ్వీ రాజ్ కు తమ సినిమాకు ఎలాంటి సంబంధం లేదని అన్నాడు. దీనిపై నిర్మాత కూడా ఘాటుగా స్పందించాడు.

నిజంగా తమకు ఇలా జరుగుతుందని తెలియదని అందరూ దీనినీ రాజకీయంగా చూడకూడదని పేర్కొన్నారు. ఇవన్నీ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ క్రమంలో నటుడు పృథ్వీరాజ్ హాస్పిటల్ పాలయ్యారు. ఆయనకు ఒక్కసారిగా హై బీపీ రావడంతో హుటాహుటిన హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో బెడ్ పై ఉన్న ఫోటోలు అండ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తరవాత కథనం