బుల్లితెర ప్రముఖ కామెడీ షో అయిన జబర్దస్త్ ద్వారా ఎంతోమంది ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నారు. అందులో యాంకర్ రష్మీ ఒకరు. తన కెరీర్ మొదట్లో చిన్నచిన్న సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ చేసుకుంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.
కానీ అందులో పెద్దగా సక్సెస్ కాలేకపోయారు. హాట్ హాట్ పాత్రలు చేసిన ఆమెకు ఆఫర్లు కరువయ్యాయి. ముఖ్యంగా ఆమె గుంటూరు టాకీస్ సినిమాలో బోల్డ్ గా కనిపించి సినీప్రియుల్ని అట్రాక్ట్ చేశారు. కానీ అది కూడా ఫలించలేదు. దీంతో వాటన్నిటికీ పుల్ స్టాప్ పెట్టి యాంకర్ గా చేరింది.
జబర్దస్త్ కామెడీ షో లో తన యాంకరింగ్ తో అందరిని ఆకట్టుకుంది. తెలుగు సరిగా రాకపోవడంతో ఆమెకు అది ప్లస్ పాయింట్ అయింది. అందులో కొన్ని పదాలు ఆడియన్స్ ని బాగా అట్రాక్ట్ చేసి నవ్వించేవి. దీంతో మరింత పాపులారిటీ సంపాదించుకుంది. అదే సమయంలో సుధీర్ తో రిలేషన్ లో ఉందనే వార్తలతో మరింత గుర్తుండిపోయింది. …