Aghathiyaa: జీవ ‘అఘత్యా’ ట్రైలర్ చూశారా? గూస్ బంప్సే

ఈ మధ్యకాలంలో సినీ ప్రియులు ఎక్కువగా థ్రిల్లింగ్, సస్పెన్స్, క్రైమ్, హారర్, వంటి సినిమాలు చూసేందుకు. లవ్, ఎమోషన్ వంటి సినిమాలను పక్కన పెట్టేస్తున్నారు. ఈ క్రమంలో చాలామంది హీరోలు త్రిల్లింగ్ సినిమాల పైనే పెడుతున్నారు. అలాంటి కథలు ఉన్న దర్శకులతో సినిమాలకు ఓకే చెబుతున్నారు. ఇప్పుడు ఓ హీరో అదే చేశాడు.

గతం, వర్తమానం కలిసి పోయేలా ఉండే కథతో కోలీవుడ్ హీరో జీవా ఓ సినిమా చేస్తున్నాడు. రంగం సినిమాతో అతడు తెలుగు ప్రేక్షకుల మనసులు దోచుకున్నాడు. ఆ తర్వాత మరిన్ని తెలుగు సినిమాలు చేసి పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఇప్పుడు ఈ హీరో “అఘత్య” అనే సినిమాను చేస్తున్నాడు.

ఈ సినిమా ఫిబ్రవరి 28న గ్రాండ్గా రిలీజ్ కానుంది. పా. విజయ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఈసారి గణేష్, అనీష్ అర్జున్ దేవ్ సంయుక్తంగా కలిసి నిర్మించారు. ఇందులో యాక్షన్ కింగ్ అర్జున్, రాశి కన్నా కీలక పాత్రలో నటించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.

ఈ ట్రైలర్ ఆధ్యాంతం అందర్నీ ఆకట్టుకుంది. ఓ భయానక ప్రదేశాలను చూపించి.. ఆసక్తిని రేకెత్తించారు. మొత్తంగా ఇది హారర్ థ్రిల్లర్గా విభిన్నమైన స్టోరీ తో ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఉంది.

తరవాత కథనం