Reverse Walking Benefits: అవునా.. నిజమా: రివర్స్ వాకింగ్ చేస్తే ఇన్ని ప్రయోజనాలా?

Reverse Walking Benefits

సాధారణంగా శారీరక, మానసిక ఆరోగ్యం కోసం వాకింగ్ చేస్తుంటారు. అయితే చాలామంది వేగంగా వాకింగ్ చేస్తారు. ముందుకు నడుస్తూ చెమటలు కక్కుతారు. అయితే ముందుకు నడిచే వారి కంటే వెనుకకు నడిచే వారికి ఎక్కువ ప్రయోజనాలు ఉన్నట్లు తెలుస్తోంది. వెనుకకు నడిచే వాకింగ్ను రివర్స్ వాకింగ్ లేదా రెట్రో వాకింగ్ అని అంటారు. దీనివల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. ఫోకస్ పెరగడం, బరువు తగ్గడం, కీళ్ల నొప్పులు నయం అవడం సహ మరెన్నో ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు.

ఫోకస్ పెరగడం

రివర్స్ వాకింగ్ చేయడం వల్ల ఫోకస్ పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. ఇది స్ట్రెస్ ని తగ్గిస్తుందని అంటున్నారు. అంతేకాకుండా వెనక్కు నడవడం వల్ల సమన్వయం పెరుగుతుందని దీనివల్ల ఫోకస్ ఉంటుందని అంటున్నారు.

కండరాల బలం

వెనకకు నడవడం వల్ల కండరాల్లో బలం పెరుగుతుంది. దీనివల్ల హమ్ స్ట్రింగ్స్, గ్లూట్స్ కి బలం పెరుగుతుంది. ముఖ్యంగా అథ్లెటిక్స్ పనితీరును మెరుగ్గా ఉంచుతుంది.

కీళ్ల నొప్పులు దూరం

రివర్స్ వాకింగ్ వల్ల కీళ్ల నొప్పులు నయమవుతాయని వైద్యులు చెబుతున్నారు. మోకాళ్ల నొప్పులు ఉన్నవారికి రివర్స్ వాకింగ్ చాలా బెటర్ అంటున్నారు.

బరువు తగ్గడం

రివర్స్ వాకింగ్ వల్ల బరువు తగ్గే అవకాశం ఉందంటున్నారు. మంచి డైట్ ఫాలో అయ్యి రివర్స్ వాకింగ్ ప్రాక్టీస్ చేస్తే అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి.

తరవాత కథనం