మెగాస్టార్ చిరంజీవి కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సినిమాల్లో అయినా పర్సనల్ లైఫ్ లో అయినా ఆయన చాలా జాలీగా ఉంటారు. పంచుల మీద పంచులు వేస్తూ అందర్నీ నవ్విస్తారు. శంకర్ దాదా ఎంబిబిఎస్, శంకర్ దాదా జిందాబాద్, జై చిరంజీవ వంటి ఎన్నో సినిమాల్లో ఆయన కామెడీ అందరిని నవ్వించింది.
రియల్ లైఫ్ లో కూడా పలు ఇంటర్వ్యూలు, పలు ఈవెంట్లలో పాల్గొని పంచులు వేస్తూ ఉంటారు. ఆయన కామెడీ టైమింగ్ తో చుట్టూ ఉండే వాళ్ళు కడుపుబ్బా నవ్వుకుంటారు. అయితే తాజా ఈవెంట్ లో కూడా చిరు వేసిన కామెడీకి ఆయన ఫ్యాన్స్, సినీ ప్రియులు తెగ నవ్వుకుంటున్నారు.
తాజాగా చిరంజీవి బ్రహ్మ ఆనందం అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్నారు. ఈ సినిమాలో బ్రహ్మానందం ఆయన కుమారుడు గౌతమ్ కలిసి నటించారు. ఈ మూవీ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి తన దైన శైలిలో పంచులు వేశారు. ఈవెంట్లో యాంకర్ సుమ.. మీ తాతయ్య గురించి కొన్ని విషయాలు మాట్లాడండి అని చిరంజీవిని అడిగింది.
దీంతో ఆయన మాట్లాడుతూ “మా అమ్మ తరచూ చెప్పేది ఒక మాటని.. నీకు ఎవరు బుద్ధులు వచ్చినా పర్లేదు కానీ మీ తాతయ్య బుద్ధులు మాత్రం రాకూడదని చెప్పేది. ఎందుకంటే మా తాత చాలా రసికుడు. నాకు ఇద్దరు అమ్మమ్మలు” అనే సరదాగా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆయన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన కామెడీ టైమింగ్ కు నేటిజన్లు ఫిదా అవుతున్నారు. బాస్ రూటే సపరేటు అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఆయన హాస్యాస్పద వ్యాఖ్యలు ఈవెంట్లో అందర్నీ కడుపుబ్బా నవ్వించాయి.