Kingdom Teaser: విజయ్ ‘కింగ్‌డమ్’ టీజర్‌కి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్.. రష్మిక పోస్ట్ వైరల్!

vijay devarakonda

విజయ్ దేవరకొండ నటిస్తున్న కొత్త చిత్రం కింగ్డమ్. ఈ సినిమా టీజర్ ని తాజాగా రిలీజ్ చేశారు. ఇందులో విజయ్ దేవరకొండ మాస్ అండ్ రగ్గడ లుక్ లో కనిపించి ఫ్యాన్స్ మనసు దోచుకున్నాడు. ఈ సినిమా టైటిల్ తో పాటు టీజర్ రిలీజ్ చేసి భారీ అంచనాలను క్రియేట్ చేశారు. 1:55 నిమిషాల నిడువుతో వచ్చిన ఈ టీజర్ అదిరిపోయింది. దానికి తోడు ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ గూస్ బంప్స్ తెప్పించింది.

అలసట లేని బీకర యుద్ధం రణ భూమిని చీల్చుకుంటూ పుట్టే కొత్త రాజు కోసం అంటూ ఎన్టీఆర్ డైలాగ్ ఎలివేషన్ మాత్రం అబ్బో అదిరిపోయిందని చెప్పాలి. పవర్ఫుల్ సన్నివేశాలతో కట్ చేసిన ఈ టీజర్ సినీప్రియల్ ని మరో ప్రపంచం లోకి తీసుకెళ్లింది. విజయ్ దేవరకొండ లుక్కు మాత్రం పవర్ ఫుల్ గా ఊర మాస్ గా ఉంది. అవసరమైతే మొత్తం తగలెట్టేస్తా అని విజయ్ దేవరకొండ చెప్పిన డైలాగు మాత్రం ఉంది కదా అదిరిపోయింది అంతే.

ఇక ఎన్టీఆర్ వాయిస్ ఓవర్, విజయ్ దేవరకొండ మాస్ యాక్షన్, అనిరుద్ బిజిఎం పిచ్చ పిచ్చగా ఎక్కేసింది. ఇక అన్ని పనులు పూర్తి చేసుకొని ఈ చిత్రాన్ని మే 30 న రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ టీజర్ లో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఈ చిత్రాన్ని దర్శకుడు గౌతమ్ తిన్ననూరి అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని టాలీవుడ్ అగ్ర ప్రొడ్యూసర్ నాగవంశీ, సాయి సౌజన్య కలిసి నిర్మిస్తున్నారు.

ఇక ఈ టీజర్ కు తమిళ్ వెర్షన్ లో సూర్య, హిందీలో రన్బీర్ కపూర్ వాయిస్ ఓవర్ అందించారు. ప్రస్తుతం ఈ టీజర్ యూట్యూబ్లో సంచలనం క్రియేట్ చేస్తుంది. లైక్ లు వ్యూస్ తో దూసుకుపోతోంది. ఎవరు కనీ విని ఎరుగని రీతిలో అదరగొడుతుంది. ఈ టీజర్ పై నేషనల్ క్రష్ రష్మిక అదిరిపోయే పోస్ట్ పెట్టింది. ఈ మనిషి ఎప్పుడూ మెంటల్ గా వస్తాడు.. విజయ్ దేవరకొండ చాలా గర్వంగా ఉంటాడు అంటే తన ఇంస్టాల్ స్టోరీలో రాసుకోవచ్చు. ప్రస్తుతం అది ట్రెండింగ్ అవుతుంది.

తరవాత కథనం