Dil Ruba Release Date: కిరణ్ అబ్బవరం ‘దిల్ రూబ’ రిలీజ్ డేట్ అఫీషియల్ అనౌన్స్.. ఎప్పుడంటే?

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కొత్త కొత్త సినిమాలతో దూసుకుపోతున్నాడు. విభిన్న కథలతో ప్రేక్షకులను అలరించి అదరగొడుతున్నాడు. గతంలో “క” అనే సినిమాతో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఒక చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈ చిత్రం కని విని ఎరుగని రీతిలో రెస్పాన్స్ అందుకుంది. ఒక క్రైమ్, థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా లో కిరణ్ అబ్బవరం యాక్టింగ్ అదిరిపోయింది.

ఇక అదే జోష్ లో ఇప్పుడు మరో సినిమా చేస్తున్నాడు. తన కెరీర్లో 10వ సినిమాగా “దిల్ రూబ” అనే సినిమాలో నటిస్తున్నాడు. విశ్వ కరుణ్ ఈ సినిమాతో దర్శకుడుగా ఎంట్రీ ఇస్తున్నాడు. శివ సెల్యులాయిడ్ ప్రొడక్షన్, ప్రముఖ మ్యూజిక్ లేబుల్ సరిగమ తన నిర్మాణ సంస్థ అయిన ఏ యుడ్లి ఫిలిం సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతేకాకుండా ఇటీవల రిలీజ్ అయిన టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి ఓ వార్త వైరల్ గా మారింది. ఈ చిత్రాన్ని ముందుగా ఫిబ్రవరి 14న అంటే వాలెంటైన్స్ డే రోజున రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించారు. కానీ అనుకోని కారణాలవల్ల ఆ రిలీజ్ డేట్ వాయిదా పడింది.

ఇప్పుడు దానికి సంబంధించి వార్త బయటకు వచ్చింది. ఈ చిత్రాన్ని మార్చి 14న రిలీజ్ చేస్తున్నాం అని మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు. ఈ మేరకు ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. అందులో కిరణ్ అబ్బవరం లుక్ అదిరిపోయింది. ప్రస్తుతం అది వైరల్ గా మారింది. ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం మెకానికల్ స్టూడెంట్ గా కనిపించబోతున్నట్లు సమాచారం.

తరవాత కథనం