ప్రస్తుత కాలంలో చాలామంది జీవన శైలి లో మార్పు కారణంగా ఎసిడిటీ బారిన పడుతున్నారు. కడుపులో ఆమ్లం పెరిగి అనేక సమస్యలకు గురవుతున్నారు. అయితే దీనిని కొందరు లైట్ గా తీసుకుని తమ సమస్యను పెంచుకుంటున్నారు. దీని కారణంగా అల్సర్ సహా మరెన్నో సమస్యలు వస్తాయి.
గ్యాస్ట్రిక్ సమస్య అధికమవడంతో గుండె సమస్యలు కూడా వచ్చే ప్రమాదముంది. అయితే ఎలాంటి మందులు వాడకుండా కొన్ని ఆహార పదార్థాలు తీసుకుంటే వాటిని నియంత్రించవచ్చు. అదేంటి ఇప్పుడు తెలుసుకుందాం.
పాలు
తక్కువ కొవ్వు పదార్థాలు కలిగిన పాలను తీసుకోవడం మంచిది. దీనివల్ల కడుపులోని ఆమ్లం బ్యాలెన్స్ అవుతుంది. గోరువెచ్చగా తీసుకోవాలి.
ఓట్స్
ఓట్స్ వల్ల కూడా కడుపులో మంట తగ్గుతుంది. జీర్ణ సమస్యలు కూడా దూరమవుతాయి. అందువల్ల ఓట్స్ తీసుకోవాలి. దీనినే బ్రేక్ ఫాస్ట్ గా తీసుకుంటే ఇంకా మంచిది.
చూయింగ్ గమ్
చక్కెర లేని చూయింగ్ గమ్ తీసుకుంటే మంచిదని వైద్యులు చెబుతున్నారు. దీనివల్ల లాలాజల ఉత్పత్తి పెరుగుతుందని.. దీంతో కడుపులో ఆమ్లం బ్యాలెన్స్ అవుతుందని అంటున్నారు.
అరటిపండు
అరటిపండు తినడం వల్ల కడుపు సంబంధించిన సమస్యలు తగ్గుతాయి. కడుపులో మంట ఎసిడిటీ దూరమవుతాయి. వీటిని నేరుగా అయిన తినొచ్చు లేదా జ్యూస్ అయినా తాగొచ్చు.
అలోవెరా జ్యూస్
అలోవెరా జ్యూస్ చేదుగా ఉంటుంది. కానీ దీనిని తాగడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. గ్యాస్ట్రిక్ ఎసిడిటీ సమస్యలను దూరం చేయడంలో ఇది సహాయపడుతుంది. మంటను తగ్గిస్తుంది.