స్కిన్ కేర్ విషయంలో ఆడవారే కాదు మగవారు కూడా జాగ్రత్తలు తీసుకుంటారు. తమ ఫేస్ అందంగా మెరవాలని ఎంతో తాపత్రయపడతారు. ఎదురుగా చూసే అమ్మాయి ఒక్కసారిగా ఫ్లట్ అయిపోవాలని.. తన అందాన్ని మరింత పెంచుకోవడం కోసం చాలా ప్రయత్నిస్తాడు. కానీ ఎన్ని చేసినా మార్పు రాకపోవడంతో చాలామంది నిరాశ పడుతుంటారు. అలాంటి వారు ఇక నిరాశ పడాల్సిన అవసరం లేదు. ముడతలు, మొటిమలు లేని స్కిన్ కోసం బేసిక్ రొటీన్ ప్లాన్స్ చేసుకోవాలని స్కిన్ కేర్ నిపుణులు చెబుతున్నారు. కొన్ని టిప్స్ ఫాలో అయితే చాలని అంటున్నారు. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
స్కిన్ కేర్ రొటీన్ ప్లాన్
పురుషులు సాధారణంగా ఎక్కువగా ఎండలో తిరుగుతారు. కాబట్టి సన్ స్క్రీన్ ని యూస్ చేయాలని నొప్పులు చెబుతున్నారు. లేదా మాయిశ్చరైజర్లు, సీరంలు వంటివి వాడొచ్చని అంటున్నారు.
ఫేస్ క్లీనింగ్
చాలామంది బయట తిరిగి వచ్చాక కనీసం ఫేస్ కూడా కడుక్కోరు. దీనివల్ల స్కిన్ చాలా రఫ్ గా తయారవుతుంది. దీంతో ముఖం పై ముడతలు రావడం మొదలవుతాయి. కాబట్టి ఇంటికి వచ్చాక చల్లనీలతో ముఖం కడుక్కుంటే మంచిదని అంటున్నారు. ఆ తర్వాత స్కిన్ కి మార్చరైజర్ ని వాడితే చర్మానికి మంచి పోషణ అందుతుందని చెబుతున్నారు.
అయితే ఇది కేవలం స్కిన్ కేర్ రొటీన్ టిప్స్ మాత్రమే కాకుండా ఇప్పటికే డ్యామేజ్ అయిపోయిన స్కిన్ను కూడా మళ్లీ కండిషన్లోకి తీసుకురావడానికి ఉపయోగపడుతుంది.
నాచురల్ స్కిన్ కేర్
స్కిన్ ను రక్షించడంలో కలబంద, గ్రీన్ టీ బాగా ఉపయోగపడతాయి. వీటికి తోడు యోగా మసాజ్ లు మంచి ఫలితాలను అందిస్తాయి. అంతేకాకుండా పోషకాలు ఉండే పదార్థాలు హెల్త్ ని మరింత మెరుగు పరుస్తాయి. ముఖ్యంగా ఆయిల్ ఫుడ్స్ కు దూరంగా ఉండాలి. హైడ్రేటెడ్ గా ఉండేందుకు డైలీ 8 గ్లాస్ ల వాటర్ తాగాలి. ఇలా చేస్తే సహజ మెరుపు మీ సొంతం అవుద్ది.