Diabetes Food: ఒంట్లో చక్కెర ఉంచుకొని.. ఇవన్నీ తింటున్నారా? అయితే.. అయిపోతారు!

Image Credit: Pixabay

మధుమేహం ఉన్నవారు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. కొన్ని ఆహార పదార్థాలు రక్తంలో చక్కెర స్థాయిని వేగంగా పెంచుతూ, సమస్యలను మరింత పెంచే ప్రమాదం ఉంది. ఈ కారణంగా, కొన్ని ఆహారాలను పూర్తిగా నివారించడం మంచిది.

ముఖ్యంగా, రీఫైన్డ్ చక్కెర ఉన్న ఆహారాలను పూర్తిగా దూరంగా ఉంచాలి. మిఠాయిలు, కేకులు, పెస్ట్రీలు, చక్కెర కలిగిన పానీయాలు రక్తంలో చక్కెర స్థాయిని ఒక్కసారిగా పెంచుతాయి. ఇవి మధుమేహ నియంత్రణను మరింత కష్టతరం చేస్తాయి.

⦿ తెల్ల బియ్యం గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉండటంతో రక్తంలో చక్కెర త్వరగా పెరుగుతుంది. దీని బదులుగా బ్రౌన్ రైస్ లేదా మిల్లెట్స్‌ను ఆహారంలో చేర్చుకోవడం చాలా మంచిది.

⦿ ప్రాసెస్ చేసిన ఆహారాలు, బేకరీ ఐటమ్స్, ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల మధుమేహ నియంత్రణ మరింత కష్టతరమవుతుంది. ప్రిజర్వేటివ్‌లు, అధిక కొవ్వు, అధిక కార్బోహైడ్రేట్లు ఉండే ఈ ఆహారాలు ఆరోగ్యానికి హాని కలిగించవచ్చు.

⦿ మైదాతో చేసిన ఆహార పదార్థాలను కూడా మధుమేహం ఉన్నవారు తగ్గించాలి. మైదా రొట్టెలు, పూరీలు, పాస్తాలు, బిస్కెట్లు త్వరగా హాజమై రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతాయి.

⦿ అధికంగా ఉప్పు ఉండే ఆహారాలు, చిప్స్, పాప్కార్న్, పికిల్స్ వంటి పదార్థాలు కూడా మధుమేహ రోగులు పరిమితంగా తీసుకోవాలి. ఇవి రక్తపోటును పెంచి గుండె సంబంధిత సమస్యలను తెచ్చిపెట్టవచ్చు.

⦿ మధుమేహం ఉన్నవారు ఆరోగ్యంగా ఉండటానికి కొన్ని ప్రత్యామ్నాయాలను అనుసరించాలి. తెల్ల బియ్యం బదులుగా బ్రౌన్ రైస్, క్వినోవా, మిల్లెట్స్ తీసుకోవడం మంచిది. మైదా బదులుగా గోధుమ పిండి, జొన్న, రాగి ఉపయోగించడం ఆరోగ్యకరం. చక్కెర బదులుగా తేనె వాడొచ్చు. పండ్ల తీయదనాన్ని ఆశ్వాదించవచ్చు. ప్యాకెట్ జ్యూసుల బదులుగా తాజా పండ్ల రసం, మజ్జిగ, కొబ్బరి నీరు వంటివి తీసుకోండి.

⦿ మధుమేహాన్ని సమర్థవంతంగా నియంత్రించుకోవాలంటే నిత్యం వ్యాయామం చేయడం, ఫైబర్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం, నీటిని ఎక్కువగా తాగడం, మితంగా ఆహారం తీసుకోవడం, డాక్టర్ సూచనలను పాటించడం అవసరం.

మీరు వీలైనంత వరకు టీ, కాఫీలకు దూరంగా ఉండండి. ఒక వేళ తాగాలి అనిపించినప్పుడు వైద్యుల సూచనతో షుగర్ ఫ్రీ వంటివి కలుపుకొని తాగొచ్చు. వారంలో కనీసం ఒక్కసారైనా మీ షుగర్ లెవెల్స్ చెక్ చేసుకోండి. దానికి అనుగుణంగా మీ డయాబెటిస్ డైట్‌ను ప్లాన్ చేసుకోండి. వీలైతే పౌష్టిక ఆహార నిపుణులను సంప్రదించండి. సొంత వైద్యం అస్సలు మంచిది కాదు. తప్పకుండా డాక్టర్ సలహాతోనే మందులు తీసుకోవాలి. లేకపోతే ప్రమాదంలో పడతారు.

తరవాత కథనం