Wpl (ఉమెన్స్ ప్రీమియర్ లీగ్) అట్టహాసంగా నిన్న ప్రారంభమైంది. వడోదరలోని కొటాంబి స్టేడియంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు vs గుజరాత్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం సాధించింది. గుజరాత్ జట్టు నిర్దేశించిన 202 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది.
ముందుగా టాస్ఓడి బ్యాటింగ్ కి దిగిన గుజరాత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 201 రన్స్ చేసింది. అందులో కెప్టెన్ ఆస్లీ గార్డనర్ 37 బాల్స్ లో 79 పరుగులు చేసి అదరగొట్టేసింది. అందులో ఎనిమిది సిక్సులు, మూడు ఫ్లోర్లు ఉన్నాయి. అలాగే ఓపెనర్ బెత్ మూనీ సైతం చెలరేగిపోయింది. 56 పరుగులు చేసి ఔరా అనిపించింది.
ఇక ఈ లక్ష్య చేదనకు దిగిన ఆర్సిబి మొదట చాలా తడబడింది. విజయం అసాధ్యం అనే సమయంలో రీఛా గోష్ అద్భుతమైన ఆట తీరుతో ఆర్సిబి విజయం సాధించింది. వికెట్ కీపర్ కం బ్యాట్స్మెన్ అయిన రీచాగోష్ ఆర్సిబి విజయం సాధించడంలో కీలక పాత్ర వహించింది. ఆమె 64 పరుగులు చేసి అబ్బురపరిచింది. అందులో నాలుగు సిక్స్ లు, 7ఫోర్లు ఉన్నాయి.
ఇక ఆమెకు తోడుగా అలిస్సా పెర్రి 34 బంతుల్లో 57 పరుగులు చేసి జట్టును విజయ పదంలో నడిపించింది. ఆమె నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు కొట్టింది. అలాగే కనికా అహుజా 30 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచింది. ఇక రిచా, కనిక కలిసి ఐదో వికెట్ కు 93 పరుగులు జోడించారు. మొత్తంగా గుజరాత్ జట్టు నిర్దేశించిన 202 పరుగులను ఆర్సిబి చేదించి విజయం సాధించింది.