Robinhood: నితిన్ ‘రాబిన్‌హుడ్’ సెకండ్ సింగల్ రిలీజ్.. ఏ బ్రాండ్ ను వదల్లేదుగా..!

యంగ్ హీరో నితిన్ ఒక మంచి బ్లాక్ బస్టర్ హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఇందులో భాగంగానే వరుస సినిమాలు చేస్తున్నాడు. కానీ హిట్ మాత్రం పడటం లేదు. ఈసారి ఎలాగైనా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగానే తనకు గతంలో భీష్మ అనే సినిమాతో మంచి హిట్ ఇచ్చిన దర్శకుడు వెంకీ కుడుములతో ఓ సినిమా చేస్తున్నాడు.

ఆ సినిమా “రాబిన్ హుడ్”. ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. ఇందులో నితిన్ సరసన హీరోయిన్గా శ్రీలీల నటిస్తోంది. ఫుల్ యాక్షన్ అండ్ కామెడీ జోనర్లో రాబోతున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, ఫస్ట్ సింగిల్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇక నిన్న వాలెంటెన్స్ డే సందర్భంగా మేకర్స్ అదిరిపోయే సర్ప్రైజ్ అందించారు.

ఇందులో భాగంగానే ఈ సినిమాలోని సెకండ్ సింగిల్ ను రిలీజ్ చేశారు. “వేరెవర్ యు గో” అంటూ సాగే సాంగ్ లిరికల్ వీడియోను టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల చేశారు. అయితే ఈ సాంగ్ వినడానికి మంచిగానే ఉన్నా చూడ్డానికి మాత్రం పలు బ్రాండ్లతో నిండిపోయింది అని చెప్పాలి.

సాంగ్ మొదటి నుంచి చివరి వరకు ఎన్నో బ్రాండ్లను చూపించి సాంగ్ ని కవర్ చేశారు. మరోవైపు ఈ సాంగ్లో నితిన్ శ్రీలీల క్లాసిక్ స్టెప్పులు సినీప్రియుల్ని ఆకట్టుకుంటున్నాయి. మరి ఎందుకు ఆలస్యం మీరు కూడా ఈ సాంగ్ చూసి ఎంజాయ్ చేసేయండి.

తరవాత కథనం