Chiranjeevi: చిరంజీవితో సాయి ధరమ్ తేజ్ సినిమా: చివరి దశకు షూటింగ్!

మెగాస్టార్ చిరంజీవితో నటించాలని ఎవరికి ఉండదు చెప్పండి. ఆయనతో నటించే అవకాశం కోసం ఇండస్ట్రీలో ఎంతో మంది ఎదురుచూస్తున్నారు. మెగాస్టార్‌ సినిమాలో చిన్న రోల్ అయినా పర్వాలేదని అంటున్నారు. దాని కోసం యంగ్ హీరోలు, ఆర్టిస్టులు మాత్రమే కాదు.. మెగా ఫ్యామిలీ హీరోలు సైతం ఎదురుచూస్తున్నారు. తాజాగా అలాంటి ఆఫర్‌నే మెగా హీరో అందుకున్నాడు.

అతడు మరెవరో కాదు సాయి ధరమ్ తేజ్. అతడికి మేనమామ చిరంజీవి అంటే ఎంతో ఇష్టం. చిరుతో ఒక్కసారి అయినా స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఉందంటూ గతంలో ఎన్నో ఈవెంట్లలో సాయి ధరమ్ చెప్పాడు. ఎట్టకేలకు అతడి కోరిక నెరవేరబోతుంది. మెగాస్టార్ చిరు సినిమాలో నటించే అవకాశాన్ని సాయి ధరమ్ తేజ్ అందుకున్నాడు.

దీంతో మామ అల్లుళ్లు కలిసి ఒకే స్క్రీన్ మీద సందడి చేసేందుకు సిద్ధమయ్యారు. ఆల్రెడీ ఆ సినిమా షూటింగ్ కూడా దాదాపు చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే.. ఆ సినిమాలో సాయి ధరమ్ తేజ్ ఫుల్ లెంగ్త్ పాత్ర చేయడం లేదు. కేవలం గెస్ట్ రోల్‌లో మాత్రమే అతడు సంది చేయబోతున్నాడు.

మరి వీరిద్దరూ ఏ సినిమా చేస్తున్నారు అనే విషయానికొస్తే.. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘బింబిసార’ డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో ‘విశ్వంభర’ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాలోనే సాయి ధరమ్ తేజ్ ఓ గెస్ట్ రోల్ చేస్తున్నాడు. ప్రస్తుతం మామా అల్లుళ్ళ మీద హైదరాబాద్‌లో కొన్ని ఆసక్తికర సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

తరవాత కథనం