Dark Circles Remove Tips: వావ్ ఇట్స్ అమేజింగ్.. కళ్ల కింద నల్లటి వలయాలను సహజంగా పోగొట్టేయండిలా!

Dark Circles

చాలామంది ఉరుకులు పరుగులు ఉద్యోగాలతో తమ ఆరోగ్యం పై శ్రద్ధ తీసుకోవడం లేదు. దీంతో జీవన శైలిలో మార్పులు సంభవించి అనారోగ్యం బారిన పడుతున్నారు. ఇంట్లో వండుకొని తినడానికి కాస్త సమయం కూడా లేక బయట ఫుడ్లకు అలవాటు పడుతున్నారు. దీనివల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. కనీసం సంతోషమైన నిద్రకు కూడా కరువుతున్నారు.

ముఖ్యంగా మహిళలు ఇలాంటి సమస్యల భారినపడి కంటి కింద నల్లటి వలయాలను తెచ్చుకుంటున్నారు. దీనికి నిద్ర లేకపోవడం, జన్యుపరమైన సమస్యలు తలెత్తడం వంటి అనేక కారణాలవల్ల కళ్ళ కింద నల్లటి వలయాలు ఏర్పడతాయి. ఇవి మనిషి శారీరక సౌందర్యాన్ని దెబ్బతీస్తాయి. అందువల్ల ఈ డార్క్ సర్కిల్స్ ను సహజంగా పోగొట్టేందుకు కొన్ని చిట్కాలు ఉన్నాయి. వాటిని రెగ్యులర్ గా పాటిస్తే చాలు. అవి అంటే ఇప్పుడు తెలుసుకుందాం

ప్రశాంతమైన నిద్ర

కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ రావడానికి ముఖ్య కారణం ప్రశాంతమైన నిద్ర లేకపోవడమేనని నిపుణులు చెబుతున్నారు. అందువల్ల ఇవి తగ్గాలంటే ప్రతి రోజు తప్పకుండా ఏడు నుంచి తొమ్మిది గంటలు నిద్రపోవాలి.

తగినంత నీరు

మనిషికి నీరు అనేది చాలా ముఖ్యం. హెల్తీగా ఉండాలన్నా.. అందంగా కనిపించాలన్న శరీరానికి సరిపడ నీళ్లు అవసరం. అందువల్ల కంటి కింద నల్లటి వలయాలు తగ్గడం కోసం బాడీని హైడ్రేటెడ్ గా ఉంచుకోవడం మరింత ముఖ్యమని వైద్యులు అంటున్నారు. ఇందువల్ల రోజు శరీరానికి సరిపడా వాటర్ తాగాలని చెబుతున్నారు.

హెల్తి డైట్

విటమిన్లు, ప్రోటీన్లు అధికంగా ఉండే కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు తినాలని వైద్యులు సూచిస్తున్నారు. వీటి వల్ల కూడా నల్లటి వలయాలు తగ్గుతాయని చెబుతున్నారు.

అలర్జీలకు దూరం

చాలామంది కళ్ళను తరచూ రుద్దడం నడపడం చేస్తుంటారు. ఇలాంటివి కంటి అలర్జీలకు కారణమై కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ కి దారి తీస్తాయి. అందువల్ల ఈ అలవాటును అనుకుంటే మంచిది.

యోగ

యోగ లేదా ధ్యానం అనేది మనిషి ఆరోగ్యానికి అందానికి అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తాయి. ఇలా చేయడం వల్ల ఒత్తిడి తగ్గి డార్క్ సర్కిల్స్ పోతాయి.

తరవాత కథనం