భారత స్టార్ స్పిన్నర్ చాహల్- ధన శ్రీ వర్మ జంట విడాకులు తీసుకోబోతున్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలు నెట్టెంటా వైరల్ అవుతున్నాయి. త్వరలో ఈ లవ్ కపుల్ విడిపోతున్నారంటూ జోరుగా వార్తలు సాగుతున్నాయి. ఈ క్రమంలో వాలెంటెన్స్ డే రోజు క్రికెటర్ చాహాల్ చేసిన పోస్టు వార్తల్లోకి ఎక్కింది.
నువ్వు ఎలా ఉన్నావో అలానే ఉండు.. ఇతరులు నీ జీవితాన్ని మార్చేందుకు అనుమతించుకు అంటూ చాహల్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్ వైరల్ గా మారింది. దీంతో చాలామంది చాహల్ అభిమానులు, క్రికెట్ ప్రియులు గుసగుసలాడుకుంటున్నారు.
అతడు ఈ పోస్ట్ ఏ కారణం చేత పెట్టాడో తెలియకపోయినా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి పెట్టి ఉంటాడని వారు భావిస్తున్నారు. ఇది మాత్రమే కాదు వీరి విడాకులు వార్తలు జోరందుకోవడంపై కూడా చాహల్ స్పందించాడు. సోషల్ మీడియాలో వార్తలు నిజం కావచ్చు కాకపోవచ్చు అని అన్నాడు. ఈ పోస్ట్ సైతం వీరి విడాకులు వార్తలకు మరింత బలాన్ని చేకూర్చింది. చూడాలి మరి చివరికి ఏం జరుగుతుందో.
2020 లో లవ్ మ్యారేజ్
చాహల్ ధనశ్రీ జంట 2020 లో లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. అనంతరం ఈ లవ్ కపుల్ రెండేళ్లు ఎంతో హ్యాపీగా జాలీగా గడిపింది. కానీ అని వార్య కారణాలతో ఈ జంట జీవితానికి శుభం కార్డు పడబోతునట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ జంట ఇన్స్టాగ్రామ్ లో ఒకరికొకరు అన్ ఫాలో చేసుకున్నారు. చాహల్ అయితే తన ఇన్స్టా నుంచి పెళ్లి ఫోటోలను డిలీట్ చేశాడు. గతంలో ధనశ్రీ కూడా చాహాలతో ఉన్న ఫోటోలను డిలీట్ చేయడంతో ఈ వార్తలు ఊపందుకున్నాయి.