Hair Growth Tips: జుట్టు పొడుగ్గా పెరగాలంటే ఈ చిన్న టిప్స్ పాటించండి.. రిజల్ట్స్ ఊహించలేరు!

long hair

ఓ వాలు జడ.. మల్లెపూల జడ.. అనేలా మీ జుట్టు ఉంటే ఎంత బాగుంటుందో అని అనుకుంటున్నారా?. కానీ అలాంటి జుట్టు లేక చాలా బాధపడుతున్నారా?. జుట్టు పొడుగ్గా పెరగాలని ఎన్నెన్నో ప్రోడక్ట్లు వాడుతున్నారా?. అయినా గ్రోత్ రావడం లేదా?. ఉన్న జుట్టు ఊడిపోతుందా?.. ఇక ఆ సమస్యకు కొన్ని చిట్కాలతో చెక్ పెట్టేయండి. జుట్టు రాలిపోకుండా పొడుగ్గా పెంచుకోవాలనుకుంటే మీ లైఫ్ స్టైల్ లో కొన్ని మార్పులు చేస్తే సరిపోతుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ట్రిమ్ చేయడం

జుట్టు పొడుగ్గా పెంచుకోవాలనుకునేవారు ప్రతి ఆరువారాలకోసారి చిన్నపాటి హెయిర్ ని కట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల స్ప్లిట్ ఎండ్స్ తగ్గి జుట్టు పెరుగుదల మెరుగ్గా ఉంటుంది. ఇలా రెగ్యులర్ గా జుట్టు కట్ చేయడం వల్ల పెరుగుదల బాగుంటుంది.

బ్లీచ్ ఆపేయాలి

చాలామంది తమ జుట్టును స్టైలిష్ గా ఉంచుకునేందుకు బ్రీచ్ కలర్స్ వేస్తుంటారు. ఇది ఆ సమయంలో స్టైల్ గా చూపించిన.. కొద్దిరోజులకు మాత్రం గడ్డిలా మారుతుంది. దీంతో హెల్తి హెయిర్ పోవడమే కాకుండా పెరుగుదల కూడా ఆగిపోతుంది. కాబట్టి వీటిని అవాయిడ్ చేయడం మంచిది. బ్లీచ్ లేని కలర్స్ వేసుకుంటే పర్లేదు.

నిద్రకు ముందు

రాత్రిపూట పడుకునే ముందు తలను శుభ్రంగా దువ్వుకోవాలి. నూనెతో మసాజ్ చేసి జుట్టును దువ్వుకుంటే హెయిర్ గ్రోత్ అవుతుంది. ఇలా చేయడం ద్వారా తలలో రక్తప్రసరణ పెరిగి జుట్టు పెరుగుదలను మెరుగ్గా చేస్తుంది.

డైట్

జుట్టు పెరుగుదలకు హెల్తీ డైట్ ఎంతో ముఖ్యం. బీన్స్, నట్స్, చేపలు సహా పోషకాలు ఉన్న పదార్థాలు తీసుకుంటే జుట్టు పెరుగుదలను మెరుగ్గా చేస్తాయి.

వేడి నీళ్లతో స్నానం ఆపేయండి

చాలామంది వేడి నీటితో తలకు స్నానం చేస్తారు. ఇలా చేయడం వల్ల జుట్టు డ్యామేజ్ ఎక్కువవుతుంది. అధికంగా డాండ్రఫ్ పెరుగుతుంది. అందువల్ల వేడి నీళ్లు తో స్నానం ఆపేసి చల్లని లేదా గోరువెచ్చని నీళ్లతో చేయవచ్చు.

తరవాత కథనం