మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వశిష్ట మల్లిడి దర్శకత్వంలో విశ్వంభర సినిమా చేస్తున్నాడు. భారీ స్థాయిలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో మెగాస్టార్ చిరంజీవి సరసన సీనియర్ హీరోయిన్ త్రిష, అలాగే యంగ్ హీరోయిన్ ఆషిక రంగనాథన్ నటిస్తున్నారు. వీరితోపాటు ఇషా చావ్లా, రమ్యా పసుపలేటి, సురభి నటీమణులు ఈ సినిమాలో కీలకపాత్రలో కనిపించనున్నారు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ ఏ రేంజ్ లో రెస్పాన్స్ అందుకున్నయో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా విశ్వంభర టీజర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. గ్రాఫిక్స్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో టీజర్ అదిరిపోయిందనే చెప్పాలి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
అయితే ఈ సినిమాలో మెగా ఫ్యామిలీ సైతం కీలక పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ నటిస్తున్నట్లు ఇటీవల వార్తలు జోరుగా సాగాయి. అతడు సినిమా మొత్తం కాకుండా కేవలం గెస్ట్ రోల్ లో మాత్రమే కనిపిస్తాడని వార్తలు వినిపించాయి. దీంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు.
ఇక ఇప్పుడు మెగా ఫ్యామిలీ నుంచి మరొకరు విశ్వంభర సినిమాలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో మెగా బ్రదర్ నాగబాబు కూతురు మెగా డాటర్ నిహారిక నటించబోతున్నట్లు సమాచారం వచ్చింది. ఆమె కూడా ఇందులో గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. హీరో ఇంట్రో సాంగ్ లో చిరుతో పాటు సాయి ధరంతేజ్, నిహారిక సందడి చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో మెగా ఫ్యామిలీ మొత్తం ఇంట్రో సాంగ్ లో డాన్స్ చేయనుండడంతో అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. దీనిపై మేకర్స్ నుంచి అఫీషియల్ అప్డేట్ రానుంది.