Producer SKN: నేను ఆ ఉద్దేశంతో అనలేదండీ బాబు: నిర్మాత SKN క్లారిటీ!

టాలీవుడ్ ప్రొడ్యూసర్ ఎస్ కే ఎన్ రీసెంట్గా తెలుగు అమ్మాయిలపై చేసిన వ్యాఖ్యలు ఎంతటి దుమారం రేపాయో అందరికీ తెలిసిందే. కోలీవుడ్ హీరో ప్రదీప్ రంగనాథన్ నటిస్తున్న రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అతడు కాంట్రవర్సియల్ వ్యాఖ్యలు చేశాడు. తెలుగులో తెలుగు వచ్చిన అమ్మాయిల కంటే తెలుగు రాని అమ్మాయిల్ని మేము ఎక్కువగా ఇష్టపడతామని అన్నారు.

అంతేకాకుండా తెలుగు వచ్చిన అమ్మాయిలను ఎంకరేజ్ చేస్తే ఆ తర్వాత ఏం జరుగుతుందో తనకు తెలిసిందని చెప్పుకొచ్చారు. అందువల్లే తాను, తమ డైరెక్టర్ సాయి రాజేష్ కలిసి తెలుగు రాని అమ్మాయిల్ని ఎంకరేజ్ చేద్దామని ఫిక్స్ అయ్యామని అన్నారు. దీంతో అతడు ఈ వ్యాఖ్యలు చేయడంపై నెటిజన్లుమండి పడ్డారు. ఒక తెలుగు ప్రొడ్యూసర్ అయి ఉండి తెలుగు అమ్మాయిల పై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని ఫైర్ అయ్యారు.

అంతేకాకుండా బేబీ సినిమా హీరోయిన్ వైష్ణవి చైతన్య ను ఉద్దేశించే ఎస్కేఎన్ ఈ వ్యాఖ్యలు చేశాడని పలువురు అభిప్రాయపడ్డారు. ఇవి నెట్టెంట వైరల్ కావడంతో నిర్మాత ఎస్ కే ఎన్ తాజాగా స్పందించాడు. ఈ మేరకు ఓ వీడియోని రిలీజ్ చేశాడు. దాని ప్రకారం.. ఈ మధ్యకాలంలో తెలుగు అమ్మాయిలను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేసిన అతి కొద్దిమంది నిర్మాతలలో తాను ఒకడినని అన్నారు.

మానస, ప్రియాంక జవాల్కర్, రేష్మ, ఆనంది, వైష్ణవి చైతన్య, ఐశ్వర్య వంటి తెలుగు అమ్మాయిలను తాను నిర్మాతగా ఉండి ఇండస్ట్రీకి పరిచయం చేసానని అన్నారు. తాను పనిచేసిన 80 శాతం మంది హీరోయిన్లు తెలుగు అమ్మాయిలే అని ఆయన చెప్పారు. తాను సరదాగా మాట్లాడిన మాటలని ఒక స్టేట్మెంట్లా స్ప్రెడ్ చేయొద్దని విజ్ఞప్తి చేశారు. ఎందుకంటే తనలా ఈ మధ్యకాలంలో ఎక్కువమంది తెలుగు అమ్మాయిలను పరిచయం ఎవరు చేయలేదని చెప్పుకొచ్చారు. అందువల్ల సరదాగా అన్నాను కాబట్టి సరదాగా తీసుకోండని పేర్కొన్నారు

తరవాత కథనం