Allu Arjun : అల్లు అర్జున్ కొత్త సినిమాకి హీరోయిన్ దొరికేసింది.. అట్లీ ప్లాన్ అదుర్స్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాతో మరింత పాపులర్ అయిపోయాడు. నేషనల్ అవార్డు విన్నర్ ఇప్పుడు వరల్డ్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమాతో బాక్సాఫీస్ బద్దలు కొట్టడమే కాకుండా రికార్డులను సైతం క్రియేట్ చేశాడు. ఈ సినిమా దాదాపు 1800 కోట్ల రూపాయలు సాధించి అందర్నీ అబ్బురపరిచింది. ఇక ఈ సినిమా తర్వాత బన్నీ.. డైరెక్టర్ త్రివిక్రమ్ తో ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

పుష్ప 2 అయిపోయిన తర్వాత కొద్దిరోజులు గ్యాప్ తీసుకుని త్రివిక్రమ్ తో కొత్త సినిమా చేస్తాడని అంతా భావించారు. కానీ అందరి ఆసలు నిరాశలు అయ్యాయి. త్రివిక్రమ్ చేయబోయే సినిమా మైథిలాజికల్ టచ్ కూడా ఉంటుందని సమాచారం. కానీ ప్రాపర్ గా కథ లేదని అందువల్ల ఏదీ లేకుండా ఈ సినిమా పట్టాలెక్కితే బడ్జెట్ పెరిగిపోతుందనే ఉద్దేశంతో త్రివిక్రమ్ తో సినిమా ఆగిపోయిందట.

దీంతో అల్లు అర్జున్ -అట్లీ కాంబో ఫిక్సయింది. ఇక అల్లు అర్జున్ కూడా అట్లీతో సినిమా చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాడు. ఇప్పుడు త్రివిక్రమ్ సైడ్ కి వెళ్ళడంతో అట్లి తెరమీదకొచ్చాడు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ కు సంబంధించి ఓ వార్త తాజాగా బయటకు వచ్చింది.

ఇందులో బాలీవుడ్ హీరోయిన్ జాన్వి కపూర్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్‌తో ఆమె జోడి బాగుంటుందని భావించి డైరెక్టర్ అట్లీ.. జాన్విని సెలెక్ట్ చేసినట్లు సమాచారం. ఇటీవలే ఎన్టీఆర్‌తో దేవర మూవీలో కనిపించిన ఈ ముద్దుగుమ్మ.. ఆ సినిమాలో తన అందం, వయ్యారంతో ఆకట్టుకుంది.

అనంతరం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌, డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబో సినిమాలో నటిస్తుంది. ఇక ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో ఆమె నటించనుందనే వార్తతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. త్వరలో ఈ సినిమా అఫీషియల్ అనౌన్స్మెంట్ రాబోతున్నట్లు తెలుస్తోంది.

తరవాత కథనం