shubman gill: అదరగొట్టిన గిల్.. వన్డేల్లో నంబర్‌ వన్‌ బ్యాటర్‌గా రికార్డు!

టీమిండియా స్టార్ బెటర్ శుభమన్ గిల్ మంచి ఫామ్ లో ఉన్నాడు. ఇటీవల జరిగిన టి20, వన్డే మ్యాచ్ లలో దుమ్ము దులిపేశాడు. ఓపెనర్ గా క్రిజ్ లోకి వచ్చి సెంచరీలు సాధించాడు. అదే సమయంలో ఎన్నో రికార్డులను సైతం బ్రేక్ చేసి కొత్త రికార్డులను సృష్టించాడు. ఇంగ్లాండ్ తో ఇటీవల వన్డే సిరీస్ లో అదరగొట్టిన గిల్ ఇప్పుడు మరో ఘనత సాధించాడు.

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ ప్లేయర్ గా నిలిచాడు. ఇప్పటివరకు ఫస్ట్ ప్లేస్ లో ఉన్న బాబర్ అజామ్ ను వెనక్కి నెట్టి గిల్ అగ్రస్థానంలోకి వెళ్ళాడు. ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కావడానికి కొద్దిసేపటి ముందు ఐసీసీ వన్డే ఫార్మేట్ లో ర్యాంకులను విడుదల చేసింది. ఈ ర్యాంకింగ్స్ లో గిల్ 796 రేటింగ్ పాయింట్లతో మొదటి స్థానంలోకి చేరుకున్నాడు.

ఇక బాబర్ అజాం 773 పాయింట్లతో రెండు స్థానంలోకి చేరుకున్నాడు. మూడో స్థానంలో రోహిత్ శర్మ 761 పాయింట్లతో కొనసాగుతున్నాడు. అయితే శుభమన్ గిల్ వన్డేల్లో టాప్ బ్యాట్స్మెన్ గా నిలవడం ఇది మొదటిసారి కాదు. అంతకుముందు 2023లో అతడు మొదటి ఘనత సాధించాడు. అప్పట్లో వన్డే ప్రపంచ కప్ జరుగుతున్న టైం లో బాబర్ను వెనక్కి నెట్టి అతడు మొదటి ప్లేస్ కు వెళ్లాడు.

ఇటీవల ఇంగ్లాండ్ తో జరిగిన సిరీస్ లో గిల్ అద్భుతమైన ఆట తీరు కనబరిచిన విషయం తెలిసిందే. మూడు మ్యాచ్ లలో ఒక సెంచరీ, రెండు అర్థ సెంచరీలు చేసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచాడు. ఇక ఈ ర్యాంకింగ్స్లో బౌలర్ల విషయానికొస్తే.. శ్రీలంక ప్లేయర్ మహీష్ తీక్షన్ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు. ఆఫ్ఘనిస్తాన్ స్టార్ బౌలర్ రషీద్ ఖాన్ ను వెనక్కి నెట్టి అతడు ఈ ఘనత సాధించాడు. ఇక ఇందులో నమీబియా ప్లేయర్ బెర్నార్డ్ స్కోల్జ్ మూడో స్థానంలో కొనసాగుతుండగా.. టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ నాలుగో స్థానంలో ఉన్నాడు.

తరవాత కథనం