పాలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే వైద్యులు ఎక్కువగా పాలు తాగాలని చెప్తారు. ముఖ్యంగా చిన్నపిల్లల్లో రోగ నిరోధక శక్తి పెరగాలంటే పాలు తాగాలని వారు సూచిస్తారు. పాలలో కాల్షియం, విటమిన్లు, ప్రోటీన్లు వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యాన్ని కాపాడతాయి. అందువల్ల పాలను కంప్లీట్ ఫుడ్ అని కూడా అంటారు.
అయితే పాలను మరిగించి మాత్రమే తాగాలని పచ్చివి తాగకూడదని వైద్యులు చెబుతుంటారు. ఇలా చేస్తే బ్యాక్టీరియా చేరి అనారోగ్యం పాడిన పడే అవకాశం ఉంది. అందువల్ల పాలను మరిగించేటప్పుడు కొన్ని విషయాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం.
చాలామందికి పాలను మరిగించే పద్ధతి తెలీదు. దీనివల్ల పాలలో ఉండే పోషకాలు నాశనం అవుతాయి. అందువల్ల ఎన్ని పాలు తాగిన ప్రయోజనాలు ఉండవు. కావున పాలను మరిగించేటప్పుడు ఎలాంటి తప్పులు చేయకూడదు ఇప్పుడు తెలుసుకుందాం.
పదే పదే మరిగించకూడదు
చాలామంది పాలను ఒకసారి మరగపెట్టిన తర్వాత మళ్లీ మళ్లీ మరగ పెడుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల పాలలో ఉండే పోషకాలు నాశనం అవుతాయి. ఇది ఏమాత్రం మంచిది కాదు అని వైద్యులు అంటున్నారు. ఇలా చేసి పాలు తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని చెబుతున్నారు. అందువల్ల పాలను ఒకసారి మాత్రం మరిగించి తాగాలని అంటున్నారు.
తక్కువ మంటపై మరిగించకూడదు
కొందరు మహిళలు పాలను చిక్కగా చేసేందుకు తక్కువ మంటపై మరిగిస్తారు. అయితే అలా చేయడం కూడా ఏమాత్రం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. తక్కువ మంట మీద ఎక్కువ సేపు పాలను మరిగించడం వల్ల దానిలోని ఉండే పోషకాలు క్రమక్రమంగా తగ్గుతాయి. దీని కారణంగా ఎన్ని పాలు తాగిన ప్రయోజనం ఉండదు. అందువల్ల పాలను మీడియం మంటపై మరిగించాలని అంటున్నారు.
పెద్ద మంటపై మరిగించకూడదు
చాలామంది పాలను త్వరగా మరిగించాలని ఉద్దేశంతో పెద్దమంట పెడతారు. ఈ విధంగా కూడా చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. పాలను పెద్ద మంటపై మరిగిస్తే దానిలోని చక్కెర కరిగిపోతుంది. దీంతో ఎన్ని పాలు తాగిన శరీరానికి తగిన పోషకాలు అందవు.