ప్రభాస్ గత ఏడాది కల్కి సినిమాతో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. హాలీవుడ్ ని మించేలా ఎక్కడా తక్కువ కాకుండా దర్శకుడు నాగ అశ్విన్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో తెరకెక్కించాడు. అసలు ఎవరూ ఇలాంటి సినిమాను తెలుగులో తీస్తారని ఊహించి ఉండరు. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా లెక్కలేనన్ని కలెక్షన్లతో దూసుకుపోయింది.
ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ మరింత బిజీ అయిపోయాడు. ప్రస్తుతం అతడి లైనప్ లో చాలా సినిమాలే ఉన్నాయి. అందులో దర్శకుడు మారుతీతో ఓ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా చాలావరకు షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇందులో ప్రభాస్ సరసన మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ నటిస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ బాగా ఆకట్టుకున్నాయి. ఇక అన్ని పనులు పూర్తి చేసుకొని ఈ చిత్రాన్ని ఏప్రిల్ 10న రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ ఇదివరకే తెలిపారు. అయితే ఇప్పుడు ఆ రిలీజ్ కాస్త కష్టమేనని తెలుస్తోంది. మేకర్స్ చెప్పిన డేట్ కు ఈ సినిమా రిలీజ్ అవ్వడం కష్టమేనని సమాచారం.
దానికి ఒక కారణం ఉంది. ఎందుకంటే ప్రభాస్ చేతిలో మరో సినిమా ఉంది. సీతా రామం మూవీ దర్శకుడు హను రాఘవపూడి తో ఫౌజీ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కారణంగా రాజా సాబ్ సినిమా లేట్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ తరుణంలోనే ఈ చిత్రాన్ని ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ చివరి నాటికి వాయిదా వేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దసరా హాలిడేస్ సీజన్ కావడంతో ఆ టైం మంచిదని ఆలోచిస్తున్నారట. చూడాలి మరి మేకర్స్ ఏం చేస్తారో.