pregnancy diet: ప్రెగ్నెన్సీ సమయంలో కచ్చితంగా తినాల్సిన పండ్లు ఇవే..!

చాలామంది మహిళలు ప్రెగ్నెన్సీ సమయంలో ఖచ్చితంగా పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవాలి. అది తమకు తమ బిడ్డకు మేలు చేస్తుంది. పిండం పెరుగుదల మెరుగ్గా ఉండాలంటే శరీరానికి సరిపడా విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉండాలి. దీనికోసం కొన్ని రకాల పండ్లు డైట్లో తీసుకుంటే మంచిదని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. పండ్లలో అవసరమైన ఫైబర్ విటమిన్లు ఉంటాయి. ఇవి శరీరం కావాల్సిన బలాన్ని చేకూరుస్తాయి. ఆ పండ్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

అరటి పండ్లు

అరటి పండ్లలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇందులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది కండరాల తిమ్మిర్లు తగ్గించడమే కాకుండా శరీరానికి సరిపడా శక్తిని అందిస్తాయి. అలసటను దూరం చేయడానికి ఉపయోగపడతాయి. ప్రెగ్నెన్సీ టైంలో మహిళలు యాక్టివ్ గా స్ట్రాంగ్ గా ఉండాలంటే అరటి పళ్ళు తింటే మంచిది.

ఆరెంజ్

హైడ్రేషన్, రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి ఈ పండ్లు ఎంతగానో ఉపయోగపడతాయి. వీటిలో విటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది. అది అనెమియాను దూరం చేస్తుంది. దీని ద్వారా డెలివరీ సమయంలో శక్తిని అందిస్తుంది. ఇందులో నీరు శాతం ఎక్కువగా ఉండడంతో శరీరం డీహైడ్రేషన్కు గురికాకుండా ఉంటుంది.

ఆపిల్

ఆపిల్ లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా త్వరగా జీర్ణం అవుతుంది. మలబద్ధకం దూరమవుతుంది. వీటిని తింటే రోజంతా యాక్టివ్ గా ఉంటారు.

వీటితోపాటు దానిమ్మ, పుచ్చకాయ, బెర్రీలు, అవకాడో వంటి పండ్లను తింటే మంచిది అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిని నేరుగా అయినా తినొచ్చు లేదా జ్యూస్ చేసుకునైన తీసుకోవచ్చు.

తరవాత కథనం